Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాజిటివ్ పే సిస్టమ్‌ పేరిట ఆర్బీఐ నుంచి కొత్త పద్ధతి.. 2021 జనవరి 1 నుంచి అమలు

పాజిటివ్ పే సిస్టమ్‌ పేరిట ఆర్బీఐ నుంచి కొత్త పద్ధతి.. 2021 జనవరి 1 నుంచి అమలు
, సోమవారం, 28 సెప్టెంబరు 2020 (18:40 IST)
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కొత్త పద్ధతిని అమలులోకి రానుంది. ఇకపై రూ.50 వేల కన్నా ఎక్కువ డబ్బును చెల్లించే లావాదేవీలు నిర్వహించే విషయంలో చెల్లింపుదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 'పాజిటివ్ పే సిస్టమ్'గా పేర్కొనే ఈ కొత్త విధానాన్ని 2021 జనవరి 1 నుండి అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. 
 
నూతనంగా ప్రారంభించనున్న పాజిటివ్ పే సిస్టమ్ గురించి బ్యాంకులు తమ కస్టమర్లకు ఎస్ఎంఎస్ అలర్ట్స్, బ్రాంచ్‌లు, ఎటిఎంలు, వెబ్సైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అవగాహన కల్పించాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులను సూచించింది. 2021 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నూతన పాజిటివ్ పే సిస్టమ్‌కు అనుగుణంగా నియమాలు నిబంధనలు పాటించిన వారి చెక్‌లు మాత్రమే క్లియర్ అవుతాయి.
 
ఈ నూతన పద్ధతి ప్రకారం, రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఖాతాదారుడి అభీష్టానుసారం ఇది చేయవలసి ఉంటుంది. రూ.5లక్షలకు మించి చెల్లింపులకు మాత్రం చెక్‌లు తప్పనిసరి చేయనుంది. 
 
కాగా చెక్ ఇచ్చేవారు, పాజిటివ్ పే సిస్టమ్ కింద, ఆ చెక్ మినిమం డిటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుంది. చెక్ జారీ చేసిన తేదీ, లబ్ధిదారుడి పేరు, చెల్లింపుదారుడి పేరు, డబ్బులు తీయాలనుకున్న బ్యాంకు పేరు వంటి వివరాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనగా ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎటిఎంల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
 
చెల్లింపు చేసే ముందు చెక్ వివరాలు బ్యాంకు ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేయబడతాయి. చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సిటిఎస్) ద్వారా ఎలాంటి అనుమానాస్పద అంశాలు పరిశీలనకు వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే అవకకాశం ఉంటుంది. 
 
కాగా కొన్ని పార్టిసిపెంట్స్ బ్యాంక్స్లలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) డెవలప్ చేసిన సిటిఎస్‌ పాజిటివ్ పే ను వాడనున్నారు. అకౌంట్ హోల్డర్లకు రూ.50 వేలు మరియు అంతకంటే ఎక్కువ మొత్తాలకు చెక్కులు జారీ చేసే ఖాతాదారులందరికీ బ్యాంకులు దీన్ని ప్రారంభిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండేళ్ళపాటు మారటోరియం పొడగింపు???