పసిడి కొనాలనుకునే వారికి శుభవార్త. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (సెప్టెంబర్ 22) కాస్త తగ్గాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గింది.
తగ్గిన ధరలతో ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.45,800 కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.49,960 పలుకుతోంది.
హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.45,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.49,960 పలుకుతోంది
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద ఉంది.
ఇక మారిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ62,200కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.57,400 పలుకుతోంది.