బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్. రెండు రోజుల వ్యవధిలో నే బంగారం ధరలు సుమారు రూ. 500 వరకు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి.
ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి రూ.53వేల 460కి చేరుకుంది.
ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49వేల 10కి పెరిగింది. హైదరాబాద్ నగరంలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.
బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49వేల 10గా ఉంది. రెండు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.53వేల 20 నుంచి రూ.53వేల 460కి చేరుకుంది.