ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద ఈరోజు ఒక్కరోజు గ్యాస్ సిలిండర్ ను రూ.200 లకు అందిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర విపణిలో రూ.700 నుంచి రూ.750 వరకు ఉన్నది. ఇటీవలే గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం రూ.50 పెంచింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, గ్యాస్ సిలిండర్ ను రూ.200 లకు పేటియం ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి.
పేటియం ఓపెన్ చేసి రీఛార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్‌లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ పై బుక్ చేయాలి. మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో దానిలోకి వెళ్లి ఎల్ఫీజీ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత పేటియం ద్వారా పే చేయాలి. ఇలా చేస్తే మీకు రూ.500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అంటే మీరు గ్యాస్ సిలిండర్ కేవలం రూ.200 లకే లభిస్తుంది. అయితే, ఈ అవకాశం మొదటిసారి పేటియం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారికి మాత్రమే లభిస్తుంది.