Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక లక్ష మంది ఉద్యోగుల మార్కును అధిగమించిన ఫస్ట్‌ మెరిడియన్‌

ఒక లక్ష మంది ఉద్యోగుల మార్కును అధిగమించిన ఫస్ట్‌ మెరిడియన్‌
, బుధవారం, 27 అక్టోబరు 2021 (16:41 IST)
హెచ్‌ఆర్‌ స్టాఫింగ్‌ అండ్‌ బిజినెస్‌ సేవల కంపెనీ ఫస్ట్‌ మెరిడియన్‌ నేడు తాము ఒక లక్ష అసోసియేట్‌ మార్కును అధిగమించినట్లు వెల్లడించింది. తద్వారా గత 12 నెలల్లో 35% వృద్ధి నమోదు చేసింది. భారతదేశ వ్యాప్తంగా 1000కు పైగా ఖాతాదారుల వద్ద ఈ ఉద్యోగులను నియమించింది. కార్యకలాపాలు ప్రారంభించిన మూడు సంవత్సరాలలోనే, ఫస్ట్‌ మెరిడియన్‌ నూతన శిఖరాలను తమ గ్రూప్‌ కంపెనీలు అయినటువంటి ఇన్నోవ్‌సోర్స్‌, వీ5 గ్లోబల్‌, అఫ్లూయెంట్‌ మరియు సీబీఎస్‌ఐలలో బలీయమైన వృద్ధి నమోదు చేసింది.

 
కోవిడ్‌–19 ద్వితీయ వేవ్‌లో కూడా ఫస్ట్‌ మెరిడియన్‌ గ్రూప్‌  పలు రంగాలో వృద్ధిని చూసింది. ఈ లక్షమంది ఉద్యోగులలో ప్రతి ఐదుగురిలో ఒకరు బ్యాంకులు, ఇతర ఆర్థిక సేవల సంస్థలలో నియమించబడ్డారు. ప్రతి ఆరుగురిలో ఒకరు టెలికమ్యూనికేషన్స్‌, రిటైల్‌,కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, ఈ-కామర్స్‌ మరియు లాజిస్టిక్స్‌లో చేరారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంతో ఆటో, తయారీ రంగాలలో నూతన వృద్ధి అవకాశాలను చూస్తున్నారు.

 
‘‘మా వినియోగదారులు, అసోసియేట్లు, కొలీగ్స్‌కు ఈ సందర్భంగా ధన్యవాదములు చెబుతున్నాం. మొదటి సారిగా ఉద్యోగాలలో చేరుతున్న వారికి ఉద్యోగావకాశాలు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము.  ప్రతి రోజూ మేము సంబంధిత ఉద్యోగావకాశాలను ప్రజలకు అందించడంతో పాటుగా స్వల్పకాలంలోనే  సరైన ప్రతిభావంతులను పొందేందుకు వ్యాపార సంస్ధలకు సహాయపడుతున్నాం’’ అని సుధాకర్‌ బాలకృష్ణన్‌,గ్రూప్‌ సీఈఓ, ఫస్ట్‌ మెరిడియన్‌ అన్నారు.

 
‘‘మహమ్మారి తరువాత, ఉద్యోగ మార్కెట్‌లో సానుకూల ధోరణులను మేము చూస్తున్నాం. ఈ కారణంగానే మన దేశంలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి’’ అని సుధాకర్‌ బాలకృష్ణన్‌ అని జోడించారు. తమ గ్రూప్‌లో నాలుగు కంపెనీలు కలిగిన ఫస్ట్‌ మెరిడియన్‌ ప్రధానంగా జనరల్‌ సిబ్బంది, మేనేజ్డ్‌ సర్వీసెస్‌, ఐటీ స్టాఫింగ్‌ మరియు శాశ్వత రిక్రూట్‌మెంట్‌ పరిష్కారాలను  తమ 1100 మంది క్లయింట్స్‌కు అందించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మరో కొత్త రాజకీయ పార్టీ