Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేవలం 150 గంటల రికార్డు సమయంలో అత్యంత వేగవంతమైన భవన నిర్మాణం

image

ఐవీఆర్

, మంగళవారం, 26 నవంబరు 2024 (23:03 IST)
భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్, కేవలం 150 గంటల రికార్డు సమయంలో భారతదేశపు అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని చేయటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్, వినూత్నమైన, వేగవంతమైన నిర్మాణం పట్ల ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ యొక్క నిబద్ధతకు నిదర్శనం.
 
మొత్తం 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పూర్తిగా అధునాతన ప్రిఫ్యాబ్రికేషన్, పీఈబీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడింది. ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్ చేయబడింది, 120వ గంటకు క్లాడింగ్ చేయబడింది, నిర్ణీత కాలక్రమంలో పూర్తిగా పనిచేసే భవనం తీర్చిదిద్దబడింది.
 
ఈ భవనాన్ని పూర్తి చేయడం భారతదేశ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక డిమాండ్లను వేగం, స్థిరత్వంతో తీర్చడంలో ప్రి ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణ సాంకేతికత యొక్క అపారమైన సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. ఈ విజయం గొప్ప ప్రపంచ రికార్డును నెలకొల్పింది, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా సగర్వంగా గుర్తించబడింది. 
 
ఈప్యాక్ ప్రిఫ్యాబ్  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ సింఘానియా, ఈ మైలురాయి సాధన గురించి మాట్లాడుతూ, “పీఈబీ టెక్నాలజీని ఉపయోగించి భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని నిర్మించడం ఈప్యాక్ ప్రిఫ్యాబ్ వద్ద మాకు గౌరవంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో మా లక్ష్యం వేగవంతమైన నిర్మాణం కోసం పీఈబీ యొక్క సామర్థ్యాలను ప్రదర్శించడమే కాకుండా ఆధునిక పారిశ్రామిక అవసరాలకనుగుణంగా పర్యావరణ అనుకూల  విధానాన్ని ప్రోత్సహించడం. పీఈబీ అనేది నిజంగా నిర్మాణం యొక్క భవిష్యత్తు, మరియు పీఈబీ పరిష్కారాలు ఎక్కువ ఆమోదం పొందడంతో పరిశ్రమలో మరిన్ని బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము.." అని అన్నారు. 
 
ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నిఖెల్ బోత్రా, ఈ మైలురాయి సాధనపై తన ఆలోచనలను పంచుకుంటూ , "ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్వద్ద , మేము చేసే ప్రతి పనిలో ఆవిష్కరణ మరియు సామర్థ్యం ప్రధానమైనవి. పీఈబీ  సాంకేతికతను ఉపయోగించి భారతదేశం యొక్క అత్యంత వేగవంతమైన-నిర్మిత నిర్మాణాన్ని నిర్మించడం అనేది  పర్యావరణ అనుకూలత కీలకమైన ప్రాధాన్యతాంశముగా   కొనసాగిస్తూ నిర్మాణ పద్ధతులను పునర్నిర్వచించాలానే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. మేము పురోగతిని కొనసాగించడానికి మరియు మా క్లయింట్‌లకు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల పరిష్కారాలను అందించడానికి సంతోషిస్తున్నాము..." అని అన్నారు. 
 
గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా హెడ్ శ్రీ మనీష్ విష్ణోయి, ఈప్యాక్  టీమ్‌ను సత్కరించిన అనంతరం తన ఆలోచనలను పంచుకుంటూ , “ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ కేవలం 150 గంటల రికార్డు సమయంలో 1,51,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశపు అత్యంత వేగవంతమైన ఫ్యాక్టరీని నిర్మించడం ద్వారా గొప్ప మైలురాయిని సాధించింది. ఈ అద్భుతమైన విజయాన్ని చూసి వారికి గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేషన్‌ను అందించడం గౌరవంగా భావిస్తున్నాము . భవనం మరియు నిర్మాణంలో సామర్థ్యం మరియు ఆవిష్కరణల కోసం కొత్త ప్రమాణాలను నిర్దేశించటం ద్వారా నిర్మాణ పరిశ్రమకు ఇది ఒక పెద్ద విజయం. ఈ ఫీట్ ప్రభావం పరిశ్రమ అంతటా ప్రతిధ్వనిస్తుంది.  ప్రిఫ్యాబ్ రంగంలో ఆవిష్కరణ, నాణ్యత మరియు శ్రేష్ఠత కోసం ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ యొక్క నిరంతర అన్వేషణను నేను  అభినందిస్తున్నాను. ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ని వారి అసాధారణమైన సహకారానికి గౌరవించడం మాకు ఆనందంగా ఉంది” అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ రోడ్లపై 1 లక్ష అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ కార్ల మైలురాయి