Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సేవా కేంద్రాలతో సర్వీస్ నెట్ వర్క్‌ను విస్తరించిన నథింగ్ ఇండియా

Nothing India

ఐవీఆర్

, సోమవారం, 25 నవంబరు 2024 (23:23 IST)
లండన్‌కు చెందిన వినియోగదారు టెక్ బ్రాండ్, నథింగ్, భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫోన్ బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. పెరుగుతున్న తమ కస్టమర్లకు మెరుగ్గా సేవలు అందించడానికి తమ సర్వీస్ సెంటర్ నెట్వర్క్‌ను విస్తరించనున్నట్లు నథింగ్  ప్రకటించింది. సైబర్ మీడియా రీసెర్చ్ ప్రకారం, నథింగ్ 2024 మూడవ త్రైమాసికంలో గణనీయంగా 646% వృద్ధిని సాధించింది. ఇది బ్రాండ్ విస్తరణకు, పెరుగుతున్న ప్రజల ఆదరణకు నిదర్శనం. 
 
హైదరాబాద్‌లో ప్రత్యేకమైన సర్వీస్ సెంటర్ నవంబర్ 25న ప్రారంభించబడింది, తదుపరి నవంబర్ 26న చెన్నై సెంటర్ ప్రారంభం కానుంది, దేశవ్యాప్తంగా  కంపెనీ ప్రత్యేకమైన సర్వీస్ నెట్వర్క్ మూడు నుండి అయిదు ప్రాంతాలకు విస్తరించబడనుంది. "హైదరాబాద్, చెన్నైలో కొత్త ప్రత్యేక సేవా కేంద్రాలను ప్రారంభించడం ద్వారా మా సేవా నెట్‌వర్క్‌ను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము" అని నథింగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ప్రణయ్ రావు అన్నారు. "భారత మార్కెట్‌లో మా వేగవంతమైన వృద్ధితో పాటు అత్యుత్తమ కస్టమర్ సేవ, మద్దతు అందించడానికి మేము కట్టుబడి ఉన్నామనే దానికి ఇది నిదర్శనం. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మాకు ఇప్పటికే ఉన్న ప్రత్యేక సేవా కేంద్రాలతో పాటు ఈ కొత్త కేంద్రాలు మా కస్టమర్లకు మా ఉత్పత్తులతో ఉత్తమమైన సంరక్షణ, అనుభవాన్ని అందించడాన్ని నిర్ధారిస్తాయి" అని ఆయన చెప్పారు.
 
అదనంగా, కంపెనీకి 5 బహుల-బ్రాండ్స్ సర్వీస్ సెంటర్లలో ప్రాధాన్యత గల ప్రత్యేకమైన సర్వీస్ డెస్క్స్ ఉన్నాయి, మరిన్ని రాబోతున్నాయి. కొల్ కత్తా, గురుగ్రామ్, కొచ్చిన్, అహ్మదాబాద్, లక్నోలలో ప్రాధాన్యతా డెస్క్స్ లు పని చేస్తున్నాయి. మరొక 20 కొత్త ప్రాధాన్యతా డెస్క్ లు త్వరలోనే రాబోతున్నాయి. ఈ సదుపాయాలు కస్టమర్లకు టాప్-టియర్ సర్వీస్ కేటాయిస్తాయి, నిరంతరమైన, వేగవంతమైన, సమర్థవంతమైన అనుభవాన్ని నిర్థారిస్తాయి. నథింగ్ ఇండియా ఇప్పటికే పిక్ అప్ మరియు డ్రాప్ సర్వీసెస్ ను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 18,000 పిన్ కోడ్స్ లో సేవలు అందిస్తోంది, విస్తృత శ్రేణి ప్రజలకు సౌకర్యవంతమైన సేవను అందుబాటులో ఉంచుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి