Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారి కోసం ఈటిఎస్ టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

Advertiesment
image

ఐవీఆర్

, శుక్రవారం, 3 మే 2024 (18:55 IST)
గ్లోబల్ ఎడ్యుకేషన్ , టాలెంట్ సొల్యూషన్స్ ఆర్గనైజేషన్ అయిన ఈటిఎస్ , విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే భారతీయులకు ప్రైజ్ మనీని అందించే జాతీయ స్థాయి పోటీ అయిన టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను పరిచయం చేసింది. మొత్తం ప్రైజ్ మనీ రూ. 15 లక్షలను గెలవవచ్చు.  భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన టోఫెల్  ఇండియా ఛాంపియన్‌షిప్, పాల్గొనేవారికి ఆంగ్ల నైపుణ్యం, విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తుంది.
 
ఈ దేశవ్యాప్త పోటీ రెండు రౌండ్‌లను కలిగి ఉంటుంది: రౌండ్ 1లో 20 నిమిషాల క్విజ్ ఉంటుంది, అయితే రౌండ్ 2లో పాల్గొనేవారు జూలై 31,2024 వరకు టోఫెల్ ఐబిటి పరీక్షలో పాల్గొనవలసి ఉంటుంది.  టోఫెల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన సందర్భంగా, సచిన్ జైన్ - కంట్రీ మేనేజర్, ఇండియా & సౌత్ ఆసియా, ఈటిఎస్ మాట్లాడుతూ: "టోఫెల్  పోటీలో పాల్గొనేవారు తమ ఆంగ్ల ప్రావీణ్యత నైపుణ్యాలను ప్రదర్శించడానికి , వారి విదేశీ విద్య ప్రయాణంకు కొంత ఖర్చుతో పాటుగా ప్రైజ్ మనీని గెలుచుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. టోఫెల్ ఐబిటి అనేది 160 దేశాలలో 12,500 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలచే ఆమోదించబడిన ఒక ప్రముఖ పరీక్ష " అని అన్నారు. 
 
టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్  ప్రస్తుతం గుర్తింపు పొందిన భారతీయ ఉన్నత విద్యా సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న 3వ లేదా 4వ సంవత్సరం కళాశాల విద్యార్థుల నుండి భారతదేశంలో అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్ స్టడీస్ పూర్తి చేసి విదేశాలలో ఉన్నత విద్యా అవకాశాల కోసం చూస్తున్న వ్యక్తులు వరకూ తెరిచి ఉంచబడింది. అలాగే  రెండు (2) సంవత్సరాల వరకు ధృవీకరించదగిన పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ పని అనుభవం ఉన్న నిపుణులు కూడా అర్హులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ప్రియురాలి ఇంటికి బాంబు పార్శిల్ బాంబు - భర్త, కుమార్తె మృతి