Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశంలో రైతులు, వ్యవసాయ కమ్యూనిటీని శక్తివంతం చేస్తున్న ఎన్రైప్‌

భారతదేశంలో రైతులు, వ్యవసాయ కమ్యూనిటీని శక్తివంతం చేస్తున్న ఎన్రైప్‌
, సోమవారం, 16 ఆగస్టు 2021 (22:26 IST)
పంట కోత తరువాత కృత్రిమంగా పండ్లను పండించడానికి ఏకీకృత పరిష్కారంగా నిలుస్తున్న హైటెన్‌ ఇన్నోవేటివ్‌ సొల్యూషన్స్‌కు చెందిన ఉత్పత్తి ఎన్‌-రైప్‌. ఇది అత్యంత సరసమైన ధరలో, సౌకర్యవంతంగా, సులభంగా పండ్లను పండిస్తుంది.
 
ఈథలిన్‌ ఆధారిత పండ్లను పండించే పొడి ఎన్‌-రైప్‌. ప్రమాదకర రసాయన ఆధారిత రైపనర్లకు ఆరోగ్యవంతమైన, సురక్షిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది ఎన్-రైప్‌. యాక్టివేటెడ్‌ కార్బన్‌, సహజసిద్ధమైన పిండి పదార్ధాలు, పలు ఇతరసురక్షిత పదార్ధాలతో దీనిని తయారుచేశారు. అందువల్ల ఈ పొడి విషపూరితం కానిది. ఈ రంగంలో వినూత్నమైన ఉత్పత్తిగా ఎన్-రైప్‌ను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తించింది.
 
శ్రావణ్‌ కుమార్‌ రెడ్డి ఎన్‌, ఎన్‌-రైప్‌ మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో రైతులతో పాటుగా వ్యవసాయ సమాజానికి తగిన శక్తిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయంగా పండ్లను పండించే శక్తి రైతులకు లభిస్తే అది మధ్యవర్తుల అవసరాన్ని వారికి తప్పించడంతో పాటుగా రైతులకు లాభం చేకూరుస్తూనే వినియోగదారునికీ చెల్లించాల్సిన ధరలు తగ్గించి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పేదవాడి పరిపక్వపు పరిష్కారం. ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించవచ్చు’’ అని అన్నారు.
 
ఈ కంపెనీ నిరంతర వృద్ధిని నమోదు చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో  6 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇది ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో  ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌ వ్యవస్థలపై దృష్టి సారించడం వల్ల 12-15 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించగలదని అంచనా.  ఈ సెల్ఫ్‌-ఫండెడ్‌ కంపెనీ ఇటీవలనే ఒక మిలియన్‌ డాలర్లను సమీకరించింది. దీనిలో సగభాగం ఈక్విటీ రూపంలో సమీకరిస్తే, మిగిలిన సగాన్ని డెబ్ట్‌ రూపంలో హెచ్‌ఎన్‌ఐలు మరియు వెంచర్‌ బిల్డింగ్‌ కంపెనీ, పెట్రిచార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నుంచి సమీకరించింది. ఈ కంపెనీ ఇప్పుడు థాయ్‌ల్యాండ్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలలో సైతం విస్తరించడానికి ప్రణాళికలు చేసింది.
 
వ్యవసాయ పరిశ్రమలో సుస్థిర ఆవిష్కరణలపై హైటెన్‌ ఇన్నోవేటివ్‌ దృష్టి సారించింది. ఐదు సంవత్సరాల విస్తృత పరిశోధన తరువాత  ప్రమాదకరమైన రసాయనాలు అయినటువంటి కాల్షియం కార్బైడ్‌, ఈథెఫాన్‌  మొదలైన వాటికి భిన్నంగా వీరు ఎన్‌–రైప్‌ను సూత్రీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓకే అంతా ఆక్రమించేసారా? మీతో స్నేహానికి మేం రెడీ అంటూ తాలిబన్లుకు చైనా సందేశం