Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వతంత్య్ర డైరెక్టర్లును బోర్డ్‌లోకి తీసుకుంటూ తమ బోర్డ్‌ను శక్తివంతం చేసిన ఎమ్క్యూర్‌ ఫార్మా

స్వతంత్య్ర డైరెక్టర్లును బోర్డ్‌లోకి తీసుకుంటూ తమ బోర్డ్‌ను శక్తివంతం చేసిన ఎమ్క్యూర్‌ ఫార్మా
, శనివారం, 31 జులై 2021 (16:16 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ ఫార్మా సంస్థలలో ఒకటైన ఎమ్క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ తమ నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ విశిష్ట నేపథ్యం కలిగిన వ్యక్తులను తమ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్లకు జోడించింది. ఈ కంపెనీ ఇటీవలనే నలుగురు స్వతంత్య్ర డైరెక్టర్లను పలు రంగాలలో అపార అనుభవం కలిగిన వ్యక్తులను తీసుకుంది.
 
ఈ నూతన స్వతంత్య్ర డైరెక్టర్లలో డాక్టర్‌ శైలేష్‌ అయ్యంగార్‌ (గతంలో సనోఫీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా సేవలనందించారు), శ్రీ విజయ్‌ గోఖలే (భారత విదేశీ రాయబారిగా పలు దేశాలలో గతంలో సేవలనందించారు), శ్రీ హితేష్‌ జైన్‌ (పరినామ్‌ లా అసోసియేట్స్‌ మేనేజింగ్‌ పార్టనర్‌) డాక్టర్‌ విద్య ఎరవ్ద్వాకర్‌ (సింబియాసిస్‌ సొసైటీ ప్రిన్సిపల్‌ డైరక్టర్‌) ఉన్నారు.
 
ఈ సంవత్సరారంభంలో ఎమ్క్యూర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా శ్రీ బెర్జిస్‌ దేశాయ్‌ (ఎమ్క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌లో మూడు దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉన్నారు)బాధ్యతలను చేపట్టారు. ఈ కంపెనీ, 1997 నుంచి తమ స్వతంత్య్ర డైరెక్టర్ల నుంచి ఛైర్మన్‌ను నియమించుకునే మహోన్నత చరిత్ర కలిగి ఉంది. ఈ నూతన స్వతంత్య్ర డైరెక్టర్లు లీగల్‌, ఫార్మా, పాలసీ డెవలప్‌మెంట్‌ మరియు విద్యా రంగాలలో అపారమైన అనుభవం కలిగి ఉండటంతో పాటుగా ఎమ్క్యూర్‌ వృద్ధి పథంలో అదనపు వేగాన్ని అందించనున్నారు.
 
ఈ నియామకాలను గురించి శ్రీ సతీష్‌ మెహతా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ, ఎమ్క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ మాట్లాడుతూ, ‘‘మా బోర్డులో పలు రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులను జోడించుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. నూతన సభ్యుల అనుభవం, ఆయా రంగాలలో వారి విజ్ఞానం మా వ్యూహాత్మక కార్యకలాపాలను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. మా నూతన బోర్డ్‌ సభ్యుల మద్దతుతో మరిన్ని నూతన శిఖరాలను చేరగలమని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిఫ్ట్ ఇచ్చాడు, మత్తు మందు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్ళి అత్యాచారం చేసాడు