కోడిగుడ్ల ధరలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు డిమాండ్ పెరగడంతో కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో రికార్డు స్థాయిలో ఒక్కో కోడిగుడ్డు ఏకంగా ఏడు రూపాయలకు పెరిగింది.
చిత్తూరు జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో శుక్రవారం నాటికి 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 673కు చేరింది. ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని వ్యాపారులు అంటున్నారు. విశాఖపట్నం, హైదరాబాద్ మార్కెట్లలో రూ. 635గా నమోదైంది.
విజయవాడలో రూ.660, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రూ. 639గా పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ఇందుకు కారణం ఉత్తరాదికి కోడిగుడ్ల ఎగుమతులు పెరగడం.. తెలుగు రాష్ట్రాల్లో వ్యాధుల కారణంగా కోళ్లు మరణించడంతో కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది.