వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. పామాయిల్ ఎగుమతులపై నెల రోజుల కిందట విధించిన ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా. ఇంకా సోమవారం నుంచి నిషేధం ఎత్తివేత అమలులోకి వస్తుందని ఇండోనేషియా దేశాధ్యక్షుడు జొకొ విడొడొ ప్రకటించారు. ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో ఇండోనేషియా రైతులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేశారు
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు పెరుగగా ఇండోనేషియా నిషేధం విధించడంతో అనేక దేశాల్లో వంట నూనెల ధరలు రెండు వందల శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా నిషేధం ఎత్తేయడంతో భారత్ వంటి దేశాల్లో వంటనూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఏర్పడింది. నూనె ఉత్పత్తి, ఎగుమతులలో అగ్రగామి అయిన ఇండోనేషియా నిషేధం ఎత్తేస్తున్నట్లు ప్రకటించడంతో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.