Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ పండుగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్‌ ద్వారా వినియోగదారులకు రాఖీతో ఆనందాన్నీ అందించనున్న డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌

Raakhi
, మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:56 IST)
ప్రపంచంలో సుప్రసిద్ధమైన అంతర్జాతీయ ఎక్స్‌ప్రెస్‌ సేవా ప్రదాత డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ మరో మారు పండుగ ఆనందాన్ని హద్దులను దాటి మరీ అందిస్తూ తమ రిటైల్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆఫర్‌ను ఈ రక్షా బంధన్‌ కోసం తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌ ద్వారా కుటుంబాలను మరింత సన్నిహితంగా రాఖీలు మరియు బహుమతుల ద్వారా తీసుకురానుంది.

 
రాఖీ పండుగ ఆఫర్‌లో భాగంగా డీహెచ్‌ఎల్‌ యొక్క రిటైల్‌ వినియోగదారులు 50% వరకూ రాయితీని అంతర్జాతీయ రాఖీలు మరియు గిఫ్ట్‌ షిప్‌మెంట్స్‌పై 13 ఆగస్టు 2022 వరకూ పొందవచ్చు. ఈ రాయితీ భారతదేశ వ్యాప్తంగా 650కు పైగా రిటైల్‌  స్టోర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ షిప్‌మెంట్స్‌ బరువు 0.5 కేజీ నుంచి 2.5 కేజీలు అలాగే 5కేజీ, 10కేజీ మరియు 20కేజీల బరువు వరకూ ఉండొచ్చు. వినియోగదారులు ఈ ప్రత్యేక డీల్స్‌ను స్వీట్లు, ఎంపిక చేసిన బహుమతులు, ఇంటిలో తయారుచేసిన తియ్యందనాలు మరియు మరెన్నో అంతర్జాతీయంగా ఉన్నటువంటి తమ ప్రియమైన వారికి పంపించవచ్చు.

 
‘‘డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద, మన జీవితాల్లోకి సంతోషాలను తీసుకువచ్చే పండుగల ప్రాముఖ్యతను గుర్తించాము. అందువల్ల, మేము ఈ ప్రత్యేకమైన ఆఫర్లను అత్యంత శుభప్రదమైన రక్షాబంధన్‌ కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దాము. సప్త సముద్రాల వ్యాప్తంగా రాఖీలు మరియు బహుమతులు ఉద్యమాన్ని ఇది తీసుకురావడంతో పాటుగా బంధాలనూ బలోపేతం చేయనుంది. ఇది డీహెచ్‌ఎల్‌ యొక్క  ‘ఎక్‌లెన్స్‌, సింప్లీ డెలివర్డ్‌’కు మరో ఉదాహరణ’’ అని సందీప్‌ జునేజా, వైస్‌ ప్రెసిడెంట్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, డీహెచ్‌ఎల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇండియా అన్నారు.

 
డీహెచ్‌ఎల్‌ ఇండియా ఈ సీజన్‌లో పెరిగే గిఫ్టింగ్‌ అవసరాలను తీర్చడం కోసం మరో ప్రత్యేక ఆఫర్‌నూ తీసుకువచ్చింది. దీనిని సైతం వ్యూహాత్మకంగా తీర్చిదిద్దారు. మరీ ముఖ్యంగా విదేశాలలో  నివాసమేర్పరుచుకున్న భారతీయులను మనసులో ఉంచుకుని దీనిని తీర్చిదిద్దారు. వినియోగదారులు 220 దేశాలలో  ఉన్నటువంటి డీహెచ్‌ఎల్‌ యొక్క అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై ఆధారపడి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు శుభాకాంక్షలను అందజేయవచ్చు. ఈ ఆఫర్‌, పూర్తి స్ధాయి షిప్‌మెంట్‌ విజిబిలిటీ తో వస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలకూ సౌకర్యవంతంగా డెలివరీ చేయబడుతుందనేందుకు భరోసా అందిస్తూ ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ అప్‌డేట్స్‌ షిప్‌మెంట్‌ సమయమంతటా వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరు : సచివాలయంలో గేదెల నిర్బధం - గ్రామస్తుల ఆగ్రహం