Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిజైన్ డెమోక్రసీ 2023: హైదరాబాద్ నడిబొడ్డున సృజనాత్మకత, ఆవిష్కరణల వేడుక

Advertiesment
image
, బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:09 IST)
భారతదేశపు ప్రీమియర్ డిజైన్ ఫెస్టివల్, డిజైన్ డెమోక్రసీ 2023, అక్టోబర్ 13 నుండి 15, 2023 వరకు జరుగనుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో జరుగనుంది. ఇది డిజైన్, ఆర్ట్ మరియు ఇన్నోవేషన్ యొక్క లీనమయ్యే వేడుక. డిజైన్ డెమోక్రసీ 2023, నగరం యొక్క ఇంటీరియర్- లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్. ఇది B2B, B2C కనెక్షన్‌లు రెండింటిపై దృష్టి సారిస్తుంది. ఏడు వివిధ రాష్ట్రాల నుండి స్వదేశీ భారతీయ బ్రాండ్‌లు ఈ ప్రదర్శన లో పాల్గొననున్నాయి. భారతదేశపు డిజైన్ రంగంలో అత్యుత్తమ సంస్థలను ఒకేచోటకు ఇది తీసుకురానుంది. ఫర్నిచర్, లైట్లు, కార్పెట్‌లు, సాఫ్ట్ ఫర్నిషింగ్‌లు, యాక్సెసరీలు- ఫైన్ ఆర్ట్‌తో సహా పలు విభాగాల్లో దాదాపు 60కి పైగా లగ్జరీ బ్రాండ్‌లు ఇక్కడకు రానున్నాయి. 
 
ఈ వేడుక అక్కడతో ముగియదు. "మ్యూజియం ఆఫ్ తెలంగాణ"ను పరిచయం చేయడం ద్వారా స్థానిక ప్రతిభను గౌరవించడంలో "డిజైన్ డెమోక్రసీ 2023" ఒక అడుగు ముందుకు వేసింది, ఈ ప్రాంతం యొక్క కళాత్మక వారసత్వానికి నివాళులు అర్పించే ప్రత్యేక ప్రదర్శనగా ఇది నిలుస్తుంది. డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకురాలు పల్లికా శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, "భారతీయ సృజనాత్మకత- రూపకల్పనను వేడుక చేసుకునే వేదికను రూపొందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. డిజైన్ డెమోక్రసీ కేవలం ప్రదర్శన కాదు; ఇది మన దేశంలోని ప్రతిభ, ఆవిష్కరణకు నిదర్శనం" అని అన్నారు. 
 
వ్యవస్థాపకురాలు, శైలజా పట్వారీ మాట్లాడుతూ, "హైదరాబాద్ డిజైన్ ప్రపంచంలో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సృజనాత్మక ఉప్పెనకు ఉత్ప్రేరకము నిలిచినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు. ఈవెంట్ యొక్క క్యూరేటర్ అర్జున్ రాఠీ మాట్లాడుతూ, "హైదరాబాద్ తన స్వంత డిజైన్ మహోత్సవానికి అర్హమైనది, డిజైన్ డెమోక్రసీ 2023 దానిని ప్రతిబింబించనుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కూల్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 40మంది విద్యార్థులు ఏమయ్యారు?