రాబోయే హోలీ సందర్భంగా సర్ఫ్‌ఎక్సెల్ విడుదల చేసిన ప్రకటనని మతసామరస్యానికి ప్రతీకగా ఆ సంస్థ చెప్పుకొస్తున్నప్పటికీ... అది వివాదాస్పదంగా మారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అదేదో కథలో చెప్పినట్లు... ఈ విధమైన పబ్లిసిటీతో ఆ ప్రకటన కాస్తా విజయవంతమైపోయింది.
అయితే, మరోవైపు సర్ఫ్‌ఎక్సెల్ ఉత్పాదక సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం నడుపుతూ... సర్ఫ్‌ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేయాలనే నినాదాలు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా ఈ ప్రకటన కారణంగా మరో సమస్య తలెత్తింది. కొంతమంది నెటిజన్లు సర్ఫ్‌ఎక్సెల్‌తో పాటు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌ను కూడా బాయ్‌కాట్ చేసేస్తున్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఎంఎస్ ఎక్సెల్ మొబైల్ వెర్షన్ ఉంది. దీనిలో చాలామంది రివ్యూ విభాగంలో ఎంఎస్ ఎక్సెల్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు కామెంట్లు పెట్టేయడంతోపాటు ఎంఎస్ ఎక్సెల్‌కు సింగిల్ స్టార్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. మొత్తం మీద సర్ఫ్‌ఎక్సెల్ తలనొప్పి కాస్తా... ఎంఎస్ ఎక్సెల్‌కి కూడా పట్టేసుకుంది.