Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజాస్వామ్య దేవాలయాన్ని దెయ్యాల కొంపగా మార్చేశారు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెల 19వరకు కొనసాగుతాయి. ఏడు పని దినాల పాటు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అంతకు ముందు స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ స

ప్రజాస్వామ్య దేవాలయాన్ని దెయ్యాల కొంపగా మార్చేశారు..
, గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:30 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈ నెల 19వరకు కొనసాగుతాయి. ఏడు పని దినాల పాటు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అంతకు ముందు స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగగా... సమావేశానికి మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజులు హాజరయ్యారు.
 
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చారు. చిన్నపాటి వర్షాలకే అసెంబ్లీలోకి నీళ్లు వచ్చేస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. అందుకే గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చామని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. పార్టీ ఫిరాయించిన 22 మంది శాసనసభ్యులపై తక్షణం వేటు వేస్తేనే శాసనసభకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని, సమావేశాలకు హాజరవ్వాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీని కోరారు. 
 
దీనికి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్య దేవాలయాన్ని దెయ్యాల కొంపగా మార్చారు. 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారని వైసీపీ ఫైర్ అయ్యింది. వారిలో నలుగురిని మంత్రులుగా నియమించారు. దీనిని ఏ ప్రమాణాల ప్రకారమైనా శాసనసభ అంటారా? అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తక్షణమే వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఆ ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు సభకు హాజరవబోమని తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్క భర్తతో అక్రమ సంబంధం.. తాగొచ్చి.. బజ్జీలు తెచ్చుకున్నాడని?