Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మలమ్మ చిట్టా పద్దులు ఎఫెక్ట్ - మార్కెట్ బుల్ దూకుడు

Advertiesment
నిర్మలమ్మ చిట్టా పద్దులు ఎఫెక్ట్ - మార్కెట్ బుల్ దూకుడు
, శనివారం, 1 ఫిబ్రవరి 2020 (12:42 IST)
దేశ వార్షిక బడ్జెట్ 2020-21ను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకాగానే స్టాక్ మార్కెట్‌లో బుల్ దూకుడు పెరిగింది. వివిధ శాఖలకు కేటాయింపులు ప్రకటిస్తుండగా స్టాక్ మార్కెట్లలో వేగం పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు ఇన్వెస్టర్లకు ఊతమిచ్చినట్లుగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అంతకుముందు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయిన విషయం తెల్సిందే. ఉదయం పదకొండు గంటలకు నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే స్టాక్ మార్కెట్లో కదలికలు మొదలయ్యాయి. ఆ తర్వాత కేటాయింపులు.. వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు వివరిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లలో దూకుడు మొదలైంది.
 
ప్రస్తుతం బిఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభంలో ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలుంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించడం స్టాక్ మార్కెట్లకు ఊతమిస్తోందని అంఛనా వేస్తున్నారు. 
 
మరోవైపు, ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి మొదటి ప్రాధానితమిచ్చారు. ఆరోగ్యం, ప్రారిశుధ్యం, తాగునీరుకు రెండో ప్రాధాన్యత ఇచ్చారు. విద్యా, చిన్నారుల సంక్షేమానికి మూడో ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ద్వారా ఆర్ధిక సమ్మిళిత విధానాలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తునట్టు ఆమె తెలిపారు. 
 
అందరికి ఆవాసం కల్పించేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. న్యూఇండియా సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, ప్రజా సంక్షేమం.. అనే మూడు లక్ష్యాలతో ముందుకు నడుస్తున్నట్టు ఆమె తెలిపారు. అలానే ప్రపంచంలోనే ఐదో బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు ఆమె తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర బడ్జెట్‌- దేశీయ స్టాక్ మార్కెట్ బుల్ పరుగులు.. సెన్సెక్స్ అదుర్స్