Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తారాస్థాయికి చేరిన కార్పొరేట్ గొడవలు - మోడీ సర్కారు కూలిపోతుందా?

Advertiesment
adani - ambani trade war

ఠాగూర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (20:11 IST)
దేశ కార్పొరేట్ గొడవలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యంగా దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూపు చైర్మన్ గౌతం అదానీల వ్యవహారం ఇపుడు దేశ కార్పొరేట్ రంగంలో పెను చర్చకు, పెను సంచలనంగా మారింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆది నుంచి అన్ని విధాలుగా అండదండలు అందిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో రిలయన్స్ అధినేక ముకేశ్ అంబానీ తాజాగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో కలిశారు. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత  సంతరించుకుంది. ముఖ్యంగా, బుధవారం నుంచి అదానీ - అంబానీల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. 
 
ముకేశ్ అంబానీకి చెందిన ఓఆర్ఎఫ్ అనే ఎన్జీవో సంస్థపై బుధవారం నుంచి సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కార్పొరేట్ గొడవలు ఇపుడు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ముకేశ్ అంబానీ ... సోనియా, రాహుల్ గాంధీలను కలవడంపై రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
 
ముఖ్యంగా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కూలిపోతుందా అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. 2024 జులై నెలలో కూడా రాహుల్, సోనియా, ముకేశ్‌ల మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశానికి పెద్దగా ప్రాధాన్యత ఏర్పడలేదు. కానీ, ఇపుడు జరిగిన సమావేశం మాత్రం పెద్ద చర్చనీయాంశంగాను, కార్పొరేట్ వర్గాల్లోని గొడవలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ మినహాయింపు : కేంద్రం ప్రతిపాదన