Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

99-9999స్కూటీ ఫ్యాన్సీ నెంబర్ కోసం కోట్లాది మంది పోటీ

Advertiesment
Scooty
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (18:36 IST)
Scooty
రిజిస్టరింగ్ - లైసెన్సింగ్ అథారిటీ ఒక స్కూటీ కోసం ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ (HP 99-9999)కోసం ఆన్‌లైన్‌లో రూ. 1.12 కోట్ల బిడ్ అందుకుంది. 
 
బిడ్ రిజర్వ్ ధర రూ. వెయ్యి కాగా, 26 మందితో ఈ నెంబర్ కోసం వేలం వేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో అత్యధికంగా 1,12,15,500 వేలం వేసినట్లు అధికారులు తెలిపారు.
 
బిడ్డర్ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. బిడ్డర్ డబ్బును జమ చేయని పక్షంలో రెండవ బిడ్డర్‌కు నెంబర్ వెళ్తుంది. బిడ్డింగ్ డబ్బు డిపాజిట్ చేయని పక్షంలో జరిమానా విధించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. 
 
ఇంకా రవాణా శాఖకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. బిడ్డింగ్ సమయంలో 30 శాతం బిడ్ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఒక నిబంధనను జోడించాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. అది మొత్తం డిపాజిట్ చేయని పక్షంలో జప్తు చేయబడుతుందని  రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. 
 
ఒక స్కూటీ ధర రూ.70,000 నుండి రూ.1,80,000 వరకు ఉంటుంది. కొండ ప్రాంతాలతో కూడిన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్కూటీ విక్రయాలు పెరిగాయి.
 
సిమ్లా వంటి కొండ ప్రాంతాలలో కోవిడ్ అనంతర కాలంతో పోలిస్తే స్కూటీల విక్రయాలు 30-40 శాతం పెరిగాయని సిమ్లాలోని లోవ్‌నేష్ మోటార్స్ యజమాని లోవ్నేష్ తెలిపారు.
 
కోవిడ్ తర్వాత, ప్రజా రవాణా అందుబాటులో లేనందున ప్రజలు తమ సొంత వాహనాన్ని ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారని లోవ్నేష్ చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : విత్తమంత్రి బుగ్గన