Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశపు మొట్టమొదటి ఆల్ ఇన్ వన్ చెల్లింపు పరికరం, భారత్‌పే వన్‌ను విడుదల చేసిన భారత్‌పే

BharatPe One

ఐవీఆర్

, మంగళవారం, 7 మే 2024 (19:20 IST)
ఫిన్‌టెక్ పరిశ్రమలో భారతదేశపు అగ్రగామి సంస్థ అయిన భారత్‌పే, పిఓఎస్, క్యూ ఆర్- స్పీకర్‌లను ఒకే పరికరంలోకి అనుసంధానించే భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ చెల్లింపు ఉత్పత్తి అయిన భారత్‌పే వన్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ వినూత్న ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడింది. విస్తృత శ్రేణి డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కూడిన సాంప్రదాయ కార్డ్ చెల్లింపు అవకాశాలతో పాటుగా  డైనమిక్, స్టాటిక్ క్యూ ఆర్ కోడ్, ట్యాప్-అండ్-పే సహా బహుముఖ చెల్లింపు అంగీకార ఎంపికలను అందిస్తుంది. మొదటి దశలో 100+ నగరాల్లో ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆ తరువాత 6 నెలల్లో 450+ నగరాలకు మరింతగా విస్తరించనుంది.
 
ఈ ఆవిష్కరణపై భారత్‌పే సీఈఓ నలిన్ నేగి మాట్లాడుతూ, 'భారత్‌పే వన్‌తో, డిజిటల్ చెల్లింపుల ల్యాండ్‌స్కేప్‌ను సమూలంగా మార్చే మరో వినూత్న ఉత్పత్తిని మేము తీసుకువచ్చాము, ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ఆఫ్‌లైన్ వ్యాపారులకు సామర్థ్యాన్ని, సౌకర్యాన్ని పెంచుతుంది. అనేక అవకాశాలను ఒకే పరికరంలో కలపడం ద్వారా, మేము విభిన్న రంగాల్లోని చిన్న- మధ్య తరహా వ్యాపారాల యొక్క విభిన్న అవసరాలకు అనుగుణంగా సమగ్ర పరిష్కారాన్ని అందిస్తున్నాము.." అని అన్నారు.
 
భారత్‌పే, పీఓఎస్ సొల్యూషన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రిజిష్ రాఘవన్ మాట్లాడుతూ, “భారత్‌పే వన్ మా వ్యాపార భాగస్వాములకు ఏకీకృత, సౌకర్యవంతమైన చెల్లింపు అనుభవాన్ని అందించడానికి ‘వన్-స్టాప్ పరికరం’గా రూపొందించబడింది. భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ చెల్లింపు పరికరంగా, మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడంలో వ్యాపారులకు సహాయపడుతుందని, డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు మరో గేమ్ ఛేంజర్ అవుతుందని మేము భావిస్తున్నాము" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?