Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓటు వేయడానికి వెళ్తున్నారా? రూ.250 క్యాష్‌బ్యాక్ కోసం VOTE24 కూపన్ కోడ్‌ని ఎంటర్ చేయండి

Advertiesment
vote

ఐవీఆర్

, సోమవారం, 6 మే 2024 (20:24 IST)
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు మే 13న ఒకే విడదలో జరగబోతున్నాయి. దీంతో... ఎన్నికల్లో తమ విలువైన ఓటుని వేసేందుకు ఓటర్లు ఇప్పటికే తమ ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మే 13 నాటికి తమ బస్ టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో.. తమ ప్లాట్ ఫామ్‌లో టిక్కెట్ల బుకింగ్ గణనీయంగా పెరిగిందని రెడ్ బస్ ప్రకటించింది. మే 10, 11 & 12 తేదీల్లో అంటే ఎన్నికల తేదికి ముందు రోజుల్లో తమ సొంత ఊర్లకు వెళ్లే వారి సంఖ్య దాదాపు 47% పెరుగుదల ఉంటుందని రెడ్ బస్ అంచనా వేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకం. ఇలాంటి కీలకమైన ఎన్నికల సమయాల్లో ఓటు వేసేందుకు బస్సు ప్రయాణం చాలా ముఖ్యమని మరోసారి చాటిచెప్పినట్లు అయ్యింది.
 
అయితే ఈ పెరుగుదలను బస్ ఆపరేటర్లు ముందుగానే గమనించారు. భారీగా పెరిగిన ఈ డిమాండ్ కు అనుగుణంగా బస్ ఆపరేటర్లు.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో రోజుకు 3000 కంటే ఎక్కువ సర్వీసులను నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా ఆర్టీసీ రోజుకు 4600 సర్వీసులు నడుపుతుంది. ఈ సర్వీసులన్నీ రెడ్‌బస్‌లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమ సొంత రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని ప్రాంతాలకు అత్యధిక డిమాండ్ ఉంది. మరి అలా అత్యధిక డిమాండ్ ఉన్న మార్గాలు  ఏంటో ఒక్కసారి చూద్దాం.
 
బెంగళూరు-హైదరాబాద్
హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్
హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్
ముంబయి-హైదరాబాద్
 
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కోసం రెడ్ బస్ కొన్ని ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసింది. కూకట్‌పల్లి, ఆర్టీసీ బస్టాండ్, మియాపూర్, అమీర్‌పేట్‌లను బస్సు బోర్డింగ్ కోసం నాలుగు హబ్‌లుగా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ప్రయాణికులు తమ బస్సులను ఎక్కేందుకు అవకాశాలను కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో అత్యధిక రద్దీ ఉండే అవకాశం కూడా ఉంది.
 
దేశవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు నమ్మకమైన, సౌకర్యవంతమైన బస్సు ప్రయాణ అనుభవాలను అందించడానికి రెడ్ బస్ అన్ని వేళలా సిద్ధంగా ఉంటుంది. ప్రయాణీకులకు మరింతగా సేవలు అందించేందుకు, వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కుని కచ్చితంగా వినియోగించుకునేందుకు రెడ్‌బస్ ఎన్నికల సమయంలో టిక్కెట్ బుకింగ్‌లపై తగ్గింపులను అందిస్తోంది. ప్రయాణికులు రెడ్ బస్ బుకింగ్ ద్వారా 15% తగ్గింపును రూ.250 వరకు పొందవచ్చు. రూ.250 క్యాష్‌బ్యాక్ కోసం VOTE24 కూపన్ కోడ్‌ని ఎంటర్ చేయడం ద్వారా ప్రయాణికులు తగ్గింపును పొందవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఫోటో వున్న పట్టాదారు పాసు పుస్తకాన్ని చించి తగలబెట్టిన చంద్రబాబు