బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్ నేడు తమ అత్యాధునిక హాస్పిటల్‌ను మాదాపూర్‌లో ప్రారంభించింది. మెట్రో పిల్లర్ నెంబర్ 1729, బొప్పనాస్ అన్నపూర్ణ ఆర్కేడ్, కావూరిహిల్స్, మాదాపూర్, హైదరాబాద్ వద్ద ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్‌ను శేరిలింగం పల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఎంఎల్‌ఏ అరికెపూడి గాంధీ, సన్‌షైన్ హాస్పిటల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్- డాక్టర్ ఏ వీ గురవారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాదాపూర్ కార్పోరేటర్ వి జగదీశ్వర్ గౌడ్; బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ కో-ఫౌండర్లు డాక్టర్ సాహిత్య దేవు మరియు డాక్టర్ దివ్య రెడ్డి పాల్గొన్నారు.
అత్యున్నత శ్రేణి సదుపాయాలు, సుశిక్షితులైన సిబ్బంది కలిగిన ఈ నూతన కేంద్రంలో అన్ని రకాల కంటి సమస్యలకూ అత్యంత వేగంగా చికిత్సను అందించనున్నారు. బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్‌లో లేసిక్ సర్జరీని కేవలం 1.5 సెకన్లలోనే చేస్తే , క్యాటరాక్ట్ సర్జరీని ఐదు నిమిషాలలో చేయగలరు. ఇవే కాదు, 2మిల్లీమీటర్ల కోతతో క్యాటరార్ట్ సర్జరీ చేయడంతో పాటుగా చిన్నారులు, పెద్ద వయసు వారికి ప్రత్యేకమైన చికిత్సనూ అందించనున్నారు.
ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం హాస్పిటల్ కో-ఫౌండర్లలో ఒకరైన సాహిత్య దేవు మాట్లాడుతూ, పూర్తి సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ ఏర్పాటుచేశాం. నగరంలో అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఒకటిగా నిలువాలనేది మా లక్ష్యం. పిడయాట్రిక్ ఐ కేర్, కార్నియా మార్పిడి, గ్లౌకోమా వంటి సేవలతో పాటుగా అవసరమైన అన్ని కంటి చికిత్సలనూ అందించనున్నాం. 6,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ప్రపంచ శ్రేణి సాంకేతికతను నగరవాసులకు అందుబాటులోకి తీసుకువస్తున్నాం అని అన్నారు.
బెస్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ కో-ఫౌండర్ డాక్టర్ దివ్య మాట్లాడుతూ, నగరంలో కంటి సంరక్షణను పునర్నిర్వచించడం మా లక్ష్యం. ఈ నూతన క్లీనిక్‌ను ప్రారంభించడమనేది నగరంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన కంటి సంరక్షణను చేరువచేయాలనే మా లక్ష్యంకు కొనసాగింపు అని అన్నారు.
మాదాపూర్ వద్దనున్న ఈ సెంటర్ పెరుగుతున్న ఈ ప్రాంత వాసుల అవసరాలను ప్రపంచశ్రేణి కంటి సంరక్షణ సదుపాయాలతో తీర్చనుంది. సాధారణ కంటి సమస్యలైనటువంటి కాటరాక్ట్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్‌తో పాటుగా ఈ నూతన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్‌లో గ్లౌకోమా, డయాబెటిక్ రెటినోపతి, మాక్యులర్ డీజనరేషన్, కార్నియా కండిషన్స్, కాస్మెటిక్ ఆక్యులోప్లాస్టీ, యువీఈఏ, పెడియాట్రిక్ కేర్ సేవలను కూడా అందిస్తుంది. అత్యాధునిక ఆపరేషన్ సదుపాయాలు కలిగిన ఈ సెంటర్ రోగులకు అత్యుత్తమ సర్జికల్ సేవలనుసైతం అందిస్తుంది.