భారతదేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్, ఐటీసి వ్యవసాయ అనుసంధానిత వ్యవస్థలో భాగమైన రైతులకు బ్యాంక్ రుణ ఉత్పత్తులు సేవలను అందించడానికి ఐటీసీ లిమిటెడ్‌తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం దేశంలోని మారుమూల ప్రాంతాలలో సేవలందని, తక్కువ సేవలందుతున్న రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి యాక్సిస్ బ్యాంక్‌కి ఉపకరిస్తుంది. రైతు రుణాలు, బంగారు రుణాలు మొదలైన అనేక రకాల ఉత్పత్తులను బ్యాంక్ అందజేస్తుంది.
తన పూర్తి స్థాయి అగ్రి-టెక్ అప్లికేషన్‌ను యాక్సిస్ బ్యాంక్ ఐటీసీమార్స్ (మెటా మార్కెట్ ఫర్ అడ్వాన్స్‌డ్ అగ్రికల్చరల్ రూరల్ సర్వీసెస్) ద్వారా వారి ఆర్థిక అవసరాలను తీర్చడం, రైతులకు చేరువ కావడానికి ఊతమిస్తుంది. అదనంగా భారతదేశంలోని 656 జిల్లాల్లో ఉన్న తన గ్రామీణ-పట్టణ సెమీ-అర్బన్ (ఆర్‌యుఎస్‌యు) శాఖల ద్వారా రైతులకు విస్త్రతమైన ఉత్పత్తులు, సేవలను కూడా అందిస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి యాక్సిస్ బ్యాంక్ భారత్ బ్యాంకింగ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మునీష్ శారదా మాట్లాడుతూ, యాక్సిస్ బ్యాంక్‌లో, ఆర్‌యుఎస్‌యుల వ్యాప్తంగా మార్కెట్‌లలో ఉన్న అన్ని విభాగాల కస్టమర్‌లకు సులభంగా రుణ సౌకర్యం. బ్యాంకింగ్ పరిష్కారాలు అందించడానికి మేం కృషి చేస్తున్నాం. ఈ భాగస్వామ్యం మారుమూల ప్రాంతాలలో మా పరిధిని విస్తరించడం వారికి అడ్డంకులు లేని కస్టమర్ అనుభవాన్ని అందించడం అనే మా బ్యాంక్ యొక్క భారత్ బ్యాంకింగ్ మిషన్‌కు అనుగుణంగా ఉంది. ఐటీసీమార్స్ సహాయంతో లక్షలాది రైతులతో ధృఢమైన, శాశ్వతమైన బంధంతో పాటు సమాజ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో గణనీయమైన సహకారం అందించగలమని విశ్వసిస్తున్నాం, తద్వారా భారతదేశ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాం అని అన్నారు.
ఐటిసి లిమిటెడ్ అగ్రి బిజినెస్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డివిజనల్ చీఫ్ రజనీకాంత్ రాయ్ మాట్లాడుతూ, ఐటిసి ఇ-చౌపల్ ఎకో-సిస్టమ్ ద్వారా 4 లక్షల మందికి పైగా రైతులతో అనుసంధానించబడి రైతుల జీవితాలను మార్చడానికి అనేక-విభిన్న రకాల కార్యక్రమాలను ఏళ్లుగా నిర్వహించింది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తూ, రైతులకు డిజిటల్ విప్లవం అందుబాటులోకి తీసుకురావడానికి, ఇప్పుడు ఫిజిటల్ ఎకో సిస్టమ్‌గా ఐటిసిమార్స్‌ను అమలులోకి తెచ్చాం. ఇది అత్యంత స్థానికతతో, వ్యక్తిగతీకరించిన వ్యవసాయ-సూచనలు సలహాలు, ఆర్ధిక సేవల అనుసంధానాల ద్వారా అనేక రకాల పరిష్కారాలను అందిస్తుంది.
మేం సంవత్సరాలుగా నిమగ్నమై ఉన్న దారిలోనే రైతులకు బ్యాంకింగ్ పరిష్కారాలను విస్తరించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకోవడం మాకు సంతోషంగా ఉంది. సంస్థాగత రుణాల సకాలంలో లభ్యత రైతు నాణ్యమైన ముడిసరుకులను సకాలంలో కొనుగోలు చేయగలగడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో, వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఆర్ధిక సంవత్సరం 22-23లో కొత్త-బ్యాంకు ఖాతాలను పెంచడం ద్వారా యాక్సిస్ బ్యాంక్ తన భారత్ బ్యాంకింగ్ ప్రణాళికను మరింతగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కీలకమైన అంశాలలో బ్యాంక్ బలమైన వృద్ధిని కనపరచింది. డిసెంబర్ 31, 2022 నాటికి, తన గ్రామీణ అడ్వాన్సులు 27% పెరిగాయి, పంపిణీ 12% పెరిగింది డిపాజిట్ 16% పెరిగింది.