Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యాపారవేత్తలకు తోడ్పడే రీతిలో ఎసెంట్‌ కాంక్లేవ్‌

వ్యాపారవేత్తలకు తోడ్పడే రీతిలో ఎసెంట్‌ కాంక్లేవ్‌
, మంగళవారం, 23 నవంబరు 2021 (20:33 IST)
ఆవిష్కర్తలు, ఆలోచనాపరులు, విధాన నిర్ణేతలను ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా వారి ఆలోచనలు, వారి వ్యాపార ప్రమాణం, మైలురాళ్లను గురించి తెలుపుతూ ఇతరులకు స్ఫూర్తి కలిగించే రీతిలో ఎసెంట్‌ సంస్ధ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక  వార్షిక కార్యక్రమం కాంక్లేవ్‌.

 
గత ఐదు సంవత్సరాలలో ఎసెంట్‌ కాంక్లేవ్‌‌లో 100మందికి పైగా స్పీకర్లు, ఆలోచనాపరులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు పాల్గొనడంతో పాటుగా 3వేల మందికి పైగా వ్యాపారవేత్తలు ఓ రోజు పాటు జరిగే స్ఫూర్తిదాయక సదస్సులలో పాల్గొన్నారు. గత సంవత్సరం ఈ కాంక్లేవ్‌లో డాక్టర్‌ కిరణ్‌మజుందార్‌ షా(బయోకాన్‌ లిమిటెడ్‌), డాక్టర్‌ రఘురామ్‌ రాజన్‌(పూర్వ ఆర్‌బీఐ గవర్నర్‌) కీలకోపన్యాసాలు చేశారు.

 
ఈ సంవత్సరం ఈ కాంక్లేవ్‌ను డీకోడ్‌ డిస్రప్షన్‌ నేపథ్యంతో నవంబర్‌ 26, 2021న చేయబోతున్నారు. రిమోట్‌ వర్క్‌ సంస్కృతి, ప్రతి విభాగంలోనూ డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో రాబోతున్న సంవత్సరాలలో వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఈ సదస్సులో వెల్లడించనున్నారు. గతంలో వ్యాపారాభివృద్ధికి డిజిటల్‌ సేవలు ఉంటే బాగుండేదనుకునేవారు కానీ ఇప్పుడు అవి తప్పనిసరి అయ్యాయి. వ్యాపారవేత్తలు తమ వ్యూహాలను పునర్నిర్వచించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంక్లేవ్‌ 2021 వేగంగా మారుతున్న సాంకేతిక ధోరణులు, డిజిటల్‌ పరివర్తన వ్యూహాలు, ఆలోచనా పరులు, విధాన నిర్ణేతలు అనుసరిస్తున్న విధానాలను గురించి చర్చించనున్నారు.

 
డీకోడ్‌ డిస్రప్షన్‌ నేపథ్యంతో నిర్వహించబోతున్న ఎసెంట్‌ ఈ- కాంక్లేవ్‌ 2021లో నందన్‌ నీలేకని (ఇన్ఫోసిస్‌ మరియు యుఐడీఏఐ) కీలకోపన్యాసం చేయనున్నారు. అత్యంత వేగంగా మారుతున్న డిజిటల్‌ వాతావరణంలో సంబంధితంగా ఉండటానికి అనుసరించాల్సిన విధానాలపై ఆయన చర్చించనున్నారు. హెక్టార్‌ గార్సియా, ఫ్రాన్సెస్‌ మిరాల్స్‌ (రచయితలు, ద ఇకిగాయ్‌)లు జీవిత పరమార్ధం గురించి తెలుపనున్నారు.

 
ప్యానెల్‌ సదస్సులలో అంచిత్‌ నాయర్‌(నైకా), హర్షిల్‌ మాథుర్‌(రేజర్‌పే), గౌరవ్‌ అగర్వాల్‌ (టాటా 1ఎంజీ), వంశీ కృష్ణ(వేదాంతు) తదితరులు పాల్గొనడంతో పాటుగా మహమ్మారి అనంతర ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను కంపెనీలు ఏవిధంగా ఎదుర్కొంటున్నాయి, రాబోయే సంవత్సరాలలో వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు లాంటి అంశాలను చర్చించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలిపిరి పాదాల మండపం ఓకే, మరి శ్రీవారి మెట్లు