Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యా సాంకేతికత మరియు సేవల విభాగంలో అర్వింద్‌ మఫత్‌లాల్‌ గ్రూప్‌

Advertiesment
విద్యా సాంకేతికత మరియు సేవల విభాగంలో అర్వింద్‌ మఫత్‌లాల్‌ గ్రూప్‌
, సోమవారం, 7 జూన్ 2021 (23:13 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ వ్యాపార సంస్థలలో ఒకటి కావడంతో  పాటుగా 116 సంవత్సరాల చరిత్ర కలిగిన అర్వింద్‌ మఫత్‌లాల్‌ గ్రూప్‌ ,నేడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతిక, సేవల విభాగంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. ఈ గ్రూప్‌ ఇప్పుడు యునిఫార్మ్‌ జంక్షన్‌ను విడుదల చేసింది. కె 12 పాఠశాలల కోసం భారతదేశంలో మొట్టమొదటి, ఏకీకృత, అనుసంధానిత సరఫరా చైన్‌ పరిష్కారం మరియు వేదికగా ఇది నిలుస్తుంది.
 
మఫత్‌లాల్‌ గ్రూప్‌ ఇప్పుడు యూనిఫార్మ్‌లను సరఫరా చేయడం ద్వారా పాఠశాలతో  పనిచేయడంలో తమ ఐదు దశబ్దాలకు పైగా అనుభవంపై ఆధారపడి (సంఘటి మార్కెట్‌లో స్కూల్‌ యూనిఫార్మ్‌విభాగంలో 85% వాటా సంస్ధ సొంతం ) మరియు స్కూల్‌ సరఫరా చైన్‌లో తమ సామర్థ్యం విస్తరించడం ద్వారా  విస్తృత స్థాయిలో, మరింత సమగ్రమైన శ్రేణి పాఠశాల ఉత్పత్తులు మరియు విద్యా, విద్యేతర కోర్సులు అందించడం ద్వారా పాఠశాలలు భవిష్యత్‌కు సిద్ధంగా ఉండేటట్లు తీర్చిదిద్దుతుంది.
 
యూనిఫార్మ్‌ జంక్షన్‌ ఇప్పటికే 500కు పైగా పాఠశాలలతో భారతదేశ వ్యాప్తంగా భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా 2021 సంవత్సరాంతానికి ఈ సంఖ్యను మూడు రెట్లు వృద్ధి చేసుకోవాలని లక్ష్యంగా చేసుకుంది. అంతేకాదు, రాబోయే మూడేళ్లలో ఫ్యూచరిస్టిక్‌ కె 12 విద్యార్ధి పరిష్కారాలలో  50వేలకు పైగా పాఠశాలలకు తోడ్పాటునూ అందించనుంది. 
 
మఫత్‌లాల్‌ గ్రూప్‌ తొలుత 3 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లను ఈ నూతన సంస్థలో పెట్టుబడులు పెట్టడం ద్వారా విస్తృత స్థాయి సాంకేతిక వేదికను నిర్మించనుంది. దీనితో పాటుగా అత్యుత్తమ పాఠశాల ఉత్పత్తులు మరియు అంతర్జాతీయంగా సేవా ప్రదాతలతో భాగస్వామ్య నెట్‌వర్క్‌ సైతం ఏర్పాటుచేయనుంది.
 
గ్రూప్‌ ప్రవేశాన్ని  గురించి ప్రియవ్రత మఫత్‌లాల్‌, ఎండీ అండ్‌ సీఈవొ- మఫత్‌లాల్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ కో-ఫౌండర్‌ అండ్‌ డైరెక్టర్‌,  యునిఫార్మ్‌ జంక్షన్‌ మాట్లాడుతూ, ‘‘ఎన్నో ఇతర కంపెనీలు లాగానే, ఈ మహమ్మారి అనంతరం లాక్‌డౌన్‌లు గత సంవత్సరం మా బలాలు మరియు సామర్థ్యాలను దగ్గరగా సమీక్షించుకునేందుకు సమయం అందించడంతో పాటుగా ఎంత బాగా మేము వాటిపై ఆధారపడగలం, అదే సమమంలో అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచం, సమాజపు అవసరాలను తీర్చగలమనేది సమీక్షించుకునే అవకాశమూ అందించింది.
 
అదే సమయంలో, అధిక శాతం పాఠశాలలు మరీ ముఖ్యంగా నాన్‌ మెట్రో, టియర్‌ 1, 2 నగరాలలోని పాఠశాలలు ప్రభావితమయ్యాయి మరియు నూతన సాధారణత, ఆన్‌లైన్‌ అభ్యాసం మరియు సాధారణ విద్యా కరిక్యులమ్‌కు ఆవల వెళ్లాల్సిన ఆవశ్యకతను గుర్తించడమూ జరిగింది. ఈ అనుభవం మరియు అకస్మాత్తుగా యూనిఫార్మ్‌ వ్యాపారంలో స్తబ్దత, మమ్మల్ని పునరాలోచించుకునేలా చేయడమే కాదు యూనిఫార్మ్‌ జంక్షన్‌ పుట్టుకకూ కారణమయ్యేలా తోడ్పడింది’’ అని అన్నారు.
 
‘‘యూనిఫార్మ్‌ జంక్షన్‌ యొక్క ఆఫరింగ్‌ తొలిసారిగా ఒకే భాగస్వామితో కలిసి పాఠశాలలు పనిచేయడంతో పాటుగా కె 12 విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంపై పాఠశాలలు దృష్టి కేంద్రీకరించేందుకు తోడ్పడుతుంది. మరీ ముఖ్యంగా,  నాన్‌ మెట్రో నగరాలలోని పాఠశాలలు అత్యుత్తమ అంతర్జాతీయ, భవిష్యత్‌ విద్యను పొందేందుకు తోడ్పడటంతో పాటుగా నూతన వాద్యా విధానాన్ని స్వీకరించేందుకు అత్యుత్తమంగా సిద్ధమయ్యేందుకూ తోడ్పడుతుంది’’ అని ఆయన జోడించారు.
 
గగన్‌ జైన్‌, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవో – యూనిఫార్మ్‌ జంక్షన్‌ మాట్లాడుతూ ‘‘మేము సమర్థవంతమైన సాంకేతిక వేదికను నిర్మించాం. ఇది పాఠశాలలు డిజిటల్‌గా శక్తివంతమయ్యేందుకు తోడ్పడుతూనే, వారికి సరఫరా చైన్‌ను సరళీకృతం చేస్తుంది. అదే సమయంలో వారి విద్యార్థులకు  ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను అందించేందుకూ తోడ్పడుతుంది.  మేము యూనిఫార్మ్‌ జంక్షన్‌ను వేలాది కోర్సులను అందిస్తూ ఆవిష్కరించాం. దీనిలో విద్య, విద్యేతర కరిక్యులమ్‌ కూడా తొలి దశలో ఉంటుంది.
 
భవిష్యత్‌లో దీనిని విస్తరించేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. విద్యేతర కోర్సులపై కూడా మేము ప్రత్యేకంగా దృష్టి సారించాము. అది మరింత సమగ్రమైన అభివృద్ధిని విద్యార్థులకు అందిస్తుంది. వీటిలో మానసిక ఆరోగ్యం, శారీరక శ్రేయస్సు, సాఫ్ట్‌ స్కిల్స్‌ మొదలైనవి ఉన్నాయి. విద్యార్థులకు తొలినాళ్లలోనే ఇవి జొప్పిస్తే, వారి ప్రాధమిక విద్యపై అవి మార్పును తీసుకురావడంతో పాటుగా నూతన సాధారణతో ఉపాధ్యాయులు బోధించడం ఆరంభించిన తరువాత ఫలితాలపై కూడా ప్రభావం చూపుతాయి..’’ అని అన్నారు.
 
ప్రపంచంలోనే అతిపెద్ద కె 12 పాఠశాల వ్యవస్థ భారతదేశంలో ఉంది. దాదాపు 1.4 మిలియన్‌ పాఠశాలలు, 250మిలియన్‌లకు పైగా విద్యార్థులు దీనిలో నమోదు చేసుకున్నారు. భారతీయ కె 12 వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లుగా ప్రాప్యత, నాణ్యత నిలుస్తున్నాయి. తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, అత్యధిక విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి, శిక్షణ పొందిన టీచర్లు లేకపోవడం అనేవి విద్యార్థుల నాణ్యమైన విద్యపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.
 
ఈ మహమ్మారి మరింతగా విద్యావ్యవస్థపై ప్రభావం చూపడంతో  పాటుగా బోధనా జ్ఞానంలోనూ నిర్మాణాత్మక ఖాళీలను  తీసుకువచ్చింది. దీనితో పాటుగా భావి విద్య కోసం ఆన్‌లైన్‌ మరియు హైబ్రిడ్‌ నమూనాలకూ మద్దతునందిస్తూ మౌలిక వసతులనూ తీసుకువచ్చింది. ఈ పరిస్థితులు భారతీయ విద్యా వ్యవస్థను ఆ రంగంలోని సంస్థలను  విద్య యొక్క భవిష్యత్‌ను పునరాలోచించేలా చేశాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్యున్నత నాణ్యత కలిగిన పాలు సరఫరా చేసేందుకు 27 రకాల పరీక్షలను చేస్తోన్న సిద్స్‌ ఫార్మ్‌