Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో తాజా పాలు- పెరుగును విడుదల చేసిన అమూల్‌

విజయవాడలో తాజా పాలు- పెరుగును విడుదల చేసిన అమూల్‌
, గురువారం, 10 మార్చి 2022 (19:47 IST)
విస్తృత శ్రేణిలో పాలు- పాల ఉత్పత్తులను అమూల్‌ బ్రాండ్‌ కింద విక్రయిస్తున్న గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌ లిమిటెడ్‌) నేడు అమూల్‌ తాజా పాలు- పెరుగును ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆవిష్కరించినట్లు వెల్లడించింది.

 
భారతదేశంలో అతిపెద్ద ఆహార సంస్థ అమూల్‌. రైతు సహకార ఉద్యమ శక్తికి మహోన్నతమైన ఉదాహరణగా ఇది నిలుస్తుంది. ఇది 1946లో, భారతదేశానికి స్వాతంత్య్రం రాక మునుపే కార్యకలాపాలు ప్రారంభించింది. ఇటీవలనే తమ 75వ వార్షికోత్సవాన్ని వేడుక చేసింది.

 
‘‘ప్రతి ఇంటిలోనూ అమూల్‌ ఇప్పుడు కనిపిస్తుంది. ఏదో ఒక రూపంలో భారతీయులంతా అమూల్‌ ఉత్పత్తులను రుచి చూసిన వారే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రైతుల నుంచి పాలను సేకరించడంతో పాటుగా ఈ సూపర్‌ఫుడ్‌ను విజయవాడ ప్రజలకు అందిస్తుండం పట్ల సంతోషంగా ఉన్నాము. తమ రోజువారీ డైట్‌లో అమూల్‌ ఫ్రెష్‌ మిల్క్‌ మరియు  పెరుగును ప్రజలు భాగం చేసుకోగలరనే నమ్మకంతో ఉన్నాం’’ అని జీసీఎంఎంఎఫ్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ ఆర్‌ ఎస్‌ సోధి అన్నారు.

 
విజయవాడలో అమూల్‌ ఫ్రెష్‌ మిల్క్‌ను ఆవిష్కరించారు. వీటిని అత్యత్తమ జాతుల గేదెలు, ఆవుల నుంచి సేకరించారు. పాల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకరమైన ధరలను అందించడంతో పాటుగా వినియోగదారులకు ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన పాలు మరియు పాల ఉత్పత్తులను అందుబాటు ధరలలో వినియోగదారులకు అమూల్‌ ద్వారా అందించాలని  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దీనిని చేశారు.

 
అమూల్‌ పాల కర్మాగారాన్ని విజయవాడ సమీపంలో ఏర్పాటుచేశారు. ఇక్కడ అత్యాధునిక  సౌకర్యాలు ఉన్నాయి. పాల ప్రాసెస్‌, ప్యాకింగ్‌, నిల్వ చేయడంతో పాటుగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలతో పాటుగా అమూల్‌ బ్రాండ్‌ యొక్క అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఈ సదుపాయలు  ఉన్నాయి.

 
అమూల్‌ ప్యూర్‌ బఫెలో మిల్క్‌, అమూల్‌  గోల్డ్‌ మిల్క్‌, అమూల్‌  తాజా పాలు రూపంలో ఈ పాలు లభిస్తాయి. కనీసం  6.5% ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండటం చేత అమూల్‌ బఫెలో (గేదె) పాలు అద్భుతమైన రుచితో ఉంటాయి. ఈ పాలు 500 మిల్లీలీటర్‌ 32 రూపాయల ధరలో లభిస్తాయి. అమూల్‌ గోల్డ్‌ పాలు ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌. దీనిలో ఫ్యాట్‌ 6%గా ఉంటుంది. ఇది తియ్యటి అనుభూతిని అందిస్తుంది. ఈ పాలు 500 మిల్లీ లీటర్లు 30 రూపాయల ధరలో లభిస్తుంది. అమూల్‌ తాజా మిల్క్‌లో ఫ్యాట్‌ శాతం 3.1%గా ఉంటుంది. ఇది సులభంగా అరుగుతుంది. అతి తక్కువ ఫ్యాట్‌కు ప్రత్యామ్నాయంగా ఇది ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణను టచ్ చేసి టోటల్‌గా దేశంలోనే జీరో అవుతున్న కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్‌లో సున్నానా?