బెజవాడలో రౌడీ షీటర్లకు పోలీసులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. నిజానికి బెజవాడ అంటేనే రౌడీలదే రాజ్యం. దీంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు సరికొత్త స్టైల్‌లో ఆలోచన చేశారు. రౌడీయిజం కారణంగా తమ భవిష్యత్‌ను కోల్పోయిన వారికి సమాజంలో గౌరవంగా బతికే దారి చూపిస్తున్నారు.
రౌడీషీటర్లకి జీవనోపాధిని కల్పించేందుకు ఒక ఉద్యోగ మేళాను నిర్వహించారు. దీనిపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా మాట్లాడుతూ, రౌడీషీటర్ల సమస్య ఈనాటికి కాదన్నారు. వారితో మాట్లాడినపుడు వారి బాధలను అర్థం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని వారిని కోరినట్టు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలని, మొత్తం 16 కంపెనీలు వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు.