అక్టోబర్ 3, 2021 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పండుగ కార్యక్రమం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా అమెజాన్ ఇండియా నేడు చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాల కోసం అనేక అవకాశాలను అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2021 లక్షలాది మంది చిన్న విక్రేతలకు అంకితం చేయగా, ఇందులో 450 నగరాలకు చెందిన 75,000 స్థానిక దుకాణాలు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ ప్రత్యేకమైన ఉత్పత్తుల ఎంపికను అందిస్తున్నాయి.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2021 అమెజాన్ లాంఛ్ ప్యాడ్, అమెజాన్ సహేలి, అమెజాన్ కరిగర్ వంటి ఇతర కార్యక్రమాలలో భాగంగా లక్షల మంది అమెజాన్ విక్రేతల ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. అలాగే హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, గద్వాల్, మహబూబ్‌నగర్, విశాఖపట్నం మరియు తిరుపతితో సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన టాప్ ఇండియన్ మరియు గ్లోబల్ బ్రాండ్లను ప్రదర్శిస్తుంది. ప్రైమ్ సభ్యులు ప్రారంభ యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు.
నీల్సన్ సహకారంతో నిర్వహించిన అమెజాన్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం అమెజాన్లో విక్రేతలు ఈ పండుగ సీజన్ గురించి ఆశాజనకంగా ఉన్నారు. సమీక్షకు స్పందించిన వారిలో 98% మంది విక్రేతలు టెక్నాలజీ స్వీకరణ మరియు ఇ-కామర్స్ తమ వ్యాపారాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. సమీక్షకు స్పందించిన అమెజాన్ విక్రేతల్లో 78% కన్నా ఎక్కువ మంది కొత్త వినియోగదారులను చేరుకోవాలని కోరుకోగా, 71% మంది తమ విక్రయాల్లో వృద్ధి ఉంటుందని ధీమా వ్యక్తం చేయగా, 71% మంది పండుగ సీజన్ నుంచి తమ ప్రధాన అంచనాల్లో తమ వ్యాపారంలో రికవరీని ఉంటుందని పేర్కొన్నారు.
అమెజాన్ ఇండియాలో సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ సుమిత్ సహాయ్ మాట్లాడుతూ, “ఈ పండుగ సీజన్‌లో, మా విక్రేతలు కొవిడ్-19 మహమ్మారితో ఇటీవల ఎదుర్కొన్న సవాళ్ల నుంచి పుంజుకునేందుకు మేము సహాయం చేస్తున్నాము. మా విక్రేతలు ఉత్సాహంగా ఉన్నారు మరియు వారి జీవనోపాధిని పునరుద్ధరించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు మరియు వారు తమ వ్యాపార వృద్ధిని వేగవంతం చేసుకునేందుకు పండుగ సీజన్ కోసం వేచి చూస్తున్నారు.
ఈ పండుగ సీజన్‌లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించేందుకు తెలంగాణలో 31,000 మంది, మరియు ఆంధ్రప్రదేశ్‌లో 5,100 మంది విక్రేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మా విక్రేతలు అందరికీ వృద్ధి మరియు విజయాన్ని అందిస్తుందని మేము ఆశిస్తున్నాము అని సుమిత్ పేర్కొన్నారు. మా వినియోగదారుల కోసం, పండుగ సీజన్‌లో వారికి అవసరమైన ప్రతిదాన్ని గుర్తించి, వారికి సురక్షితంగా అందించడంలో సహాయపడడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.