Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 30 నుండి జూన్ 4 మధ్య వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్‌ను ప్రకటించిన అమేజాన్ ఫ్యాషన్

Advertiesment
Amazon

ఐవీఆర్

, గురువారం, 29 మే 2025 (22:09 IST)
బెంగళూరు: మే 30 నుండి జూన్ 4 వరకు తమ 16వ వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్‌ను నిర్వహిస్తున్నామని అమేజాన్ ఫ్యాషన్ ఈ రోజు ప్రకటించింది. తమ అత్యంత విస్తారమైన బ్రాండ్ పోర్ట్ ఫోలియో 4 లక్షలకు పైగా స్టైల్స్‌తో, ఇప్పుడు 20కి పైగా బ్రాండ్స్ నుండి వ్యూహాత్మకమైన కొత్త చేరికలతో, కారట్ లేన్, GAP, వైల్డ్ క్రాఫ్ట్, ఇంకా ఎన్నో బ్రాండ్స్ సహా తమ కలక్షన్స్, ప్రత్యేకమైన కొత్త ప్రీమియం వేదిక ద ప్రీమియం ఎడిట్‌తో పాటు రీబ్రాండ్ చేయబడిన జెన్ Z  వేదిక SERVEను కూడా కలిగి ఉంది. ఈ ఎడిషన్ ప్రముఖ బ్రాండ్స్‌ను గొప్ప విలువకు అందిస్తోంది, అమేజాన్ వారి హాల్ మార్క్ సౌకర్యం, నమ్మకం, డెలివరీ వేగంతో సాటిలేని ఎంపికను కస్టమర్లకు అందిస్తోంది.
 
ప్రీమియం ఫ్యాషన్ పట్ల ఆసక్తి చూపించే వారు GUESS, అర్మాని ఎక్స్ ఛేంజ్, కాల్విన్ క్లీన్, లకోస్ట్, అలెగ్జాండర్ క్రిస్టీ, మైఖేల్ కోర్స్, మోకోబరా, టమ్మీ హిల్ ఫిగర్, లూయీ ఫిలిప్పీ, ఫాసిల్, ఇంకా ఎన్నో వాటి నుండి మరియు ట్రెండ్ పట్ల చైతన్యం కలిగిన వినియోగదారులు కొత్తగా విడుదలైన అమెరికన్ క్లాసిక్ బ్రాండ్ GAPను కనీసం 30% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. సేల్ కరాట్ లేన్ ఉత్తమమైన జ్యువలరీని కూడా పరిచయం చేసింది, అమేజాన్ వారి ప్రసిద్ధి చెందిన సౌకర్యంతో నమ్మకమైన కళాపనితనంతో కస్టమర్లకు కేటాయిస్తోంది.
 
“అమేజాన్ ఫ్యాషన్లో, మేము మీ కోసం విస్తృతమన బ్రాండ్స్, ట్రెండింగ్ స్టైల్స్ కలక్షన్, ఉత్తేజభరితమైన కొత్త విడుదలలు- అన్నింటినీ అమేజాన్ వారి నమ్మకం, సౌకర్యంతో గొప్ప విలువకు తీసుకువచ్చాం. వార్డ్ రోబ్ రిఫ్రెష్ సేల్ 16వ ఎడిషన్‌తో, కస్టమర్లు విస్తృత శ్రేణి దుస్తులు, ప్రీమియం వాచీలు, చిక్ హ్యాండ్ బాగ్స్, స్నీకర్స్ ఇంకా ఎన్నో వాటిని అన్వేషించవచ్చు. మా యొక్క కూర్చబడిన ఎంపికలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఫ్యాషన్ ఔత్సాహికుని అవసరాలు తీరుస్తుంది, అమేజాన్ ఫ్యాషన్ వారి విస్తారమైన ఆఫరింగ్స్ తో తమ రూపాన్ని పూర్తి చేసుకోవడం సులభం చేస్తుంది” అని నిఖిల్ సిన్హా, డైరెక్టర్, అమేజాన్ ఫ్యాషన్ ఇండియా అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రాండ్ అంబాసిడర్‌గా దిగ్గజ ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీని ఆహ్వానించిన డెట్టాల్