అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 23, 2025న ప్రారంభమవుతోందని అమెజాన్ ఈరోజు ప్రకటించింది. షాపింగ్ విలాసాన్ని ప్రైమ్ సభ్యులు 24 గంటలు ప్రత్యేకించి ముందుగా పొందవచ్చు. పండగ సీజన్ కోసం భారతదేశం సిద్ధమవుతుండగా, కస్టమర్లు అత్యంత వేగంగా గొప్ప ధరలకి విస్తృతమైన ఎంపిక కోసం ఎదురుచూడవచ్చు. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, సౌందర్యం, గృహ అవసరాలు, కిరాణా మరియు ఇంకా ఎన్నో వాటితో సహా అన్ని ప్రసిద్ధి చెందిన శ్రేణుల్లో ఆకర్షణీయమైన డీల్స్‌తో లీనమయ్యే షాపింగ్ అనుభవాలు, SBI క్రెడిట్- డెబిట్ కార్డ్స్ పైన 10 శాతం తక్షణ డిస్కౌంట్, ఇ.ఎం.ఐ లావాదేవీలు, ప్రముఖ బ్యాంక్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్లు, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన అదనపు క్యాష్ బాక్లతో ప్రతి ఒక్కరు ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో పొందవచ్చు.
సౌరభ్ శ్రీవాత్సవ, VP-కాటగిరీస్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు, దేశపు అతి పెద్ద షాపింగ్ సంబరం కోసం కస్టమర్లు, సెల్లర్స్, బ్రాండ్స్‌ను ఒక చోట చేర్చడం ద్వారా భారతదేశపు పండగల స్ఫూర్తిని ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సంబరం చేస్తోంది. ఈ ఏడాది, కస్టమర్లు ఒక లక్షకు పైగా ఉత్పత్తులు, బ్లాక్ బస్టర్ డీల్స్, ఉత్తేజభరితమైన కొత్త విడుదలలు, పాల్గొనే వినోదం, ఇంకా ఎన్నో వాటిపై ఈ సంవత్సరంలో అతి తక్కువ ధరలను పొందవచ్చు. ఉత్తేజభరితమైన డీల్స్‌తో పాటు లక్షలాది ఉత్పత్తులపై GSTలో తగ్గింపును కూడా సెల్లర్స్ ప్రణాళిక చేసారు, ఈ అమేజాన్ గ్రేట్ ఇండియన ఫెస్టివల్‌కి కస్టమర్లు గొప్ప ఆదాల కోసం ఎదురుచూడవచ్చు.
భారతదేశం అంతటా పండగ సీజన్ కోసం అమేజాన్ 45 కొత్త డెలివరీ స్టేషన్స్ ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. ఇవి ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలి, బులంద్ షెహర్, తమిళనాడులోని మరైమలాయ్, తిరుచురాపల్లి, పశ్చిమ బెంగాల్‌లో హౌరా, తూర్పు మిడ్నపూర్, అండమాన్లో పోర్ట్ బ్లెయిర్, ఆంధ్రప్రదేశ్‌లో నరసీపట్టణం, జమ్ము-కాశ్మీర్లో శ్రీనగర్, ఉధాంపూర్, జార్ఖండ్లో రాంచీ- గిరిదిహ్, అస్సాంలో టిన్సుకియా మరియు సిల్చార్ వంటి టియర్ II మరియు టియర్ III పట్టణాల్లో ఉన్నాయి. దీనితో, అమేజాన్‌కు దేశవ్యాప్తంగా దూర ప్రాంతాలకు డెలివరీ చేయడానికి సుమారు 2,000 సుదూర ప్రాంతాల డెలివరీ స్టేషన్స్ ఉన్నాయి. 12 కొత్త ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు మరియు 6 కొత్త సార్ట్ కేంద్రాలతో ప్రధానమైన ఆపరేషన్స్ నెట్ వర్క్ విస్తరణను కూడా అమేజాన్ ఇటీవల ప్రారంభించింది, 8.6 మిలియన్ ఘనపు అడుగుల నిల్వ చేసే సామర్థ్యాన్ని మరియు సార్టేషన్ ప్రాంతంలో 500K చదరపు అడుగుల వైశాల్యాన్ని చేర్చింది. తమ పాన్-ఇండియా కార్యకలాపాల నెట్ వర్క్ ను పెంచడానికి కంపెనీ 150,000 సీజనల్ పని అవకాశాలను కూడా సృష్టించింది మరియు దేశవ్యాప్తంగా కస్మర్ల ఆర్డర్స్ ను నమ్మకంగా అందిస్తోంది.
అభినవ్ సింగ్, VP-ఆపరేషన్స్, అమేజాన్ ఇండియా, ఆస్ట్రేలియా ఇలా అన్నారు, ప్రతి ఒక్క భారతీయునికి అత్యంత వేగంతో విస్తృతమైన ఎంపికను పొందడానికి మేము నిరంతరమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఇంతకుముందు కంటే మేము ఇప్పుడు ఎంతో వేగంగా అందిస్తున్నాము. గత ఏడాదితో పోల్చినప్పుడు, మేము ఇప్పటికే అదే రోజు డెలివరీలను దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం కంటే ఎక్కువ నగరాలకు, మరుసటి రోజు డెలివరీలను దేశవ్యాప్తంగా రెండు రెట్లు ఎక్కువ ప్రదేశాలకు అందిస్తున్నాము. 45 కొత్త డెలివరీ స్టేషన్స్ ప్రారంభించడం వలన టియర్ II, టియర్ III నగరాల్లోని ప్రజలు సహా దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు గొప్ప వేగం, నమ్మకంతో ఆనందాన్ని అందించడానికి మాకు అవకాశం ఇచ్చింది.
ఈ పండగ సీజన్లో, కస్టమర్లు సులభంగా, మరింత సౌకర్యవంతంగా షాపింగ్ చేయడానికి అమెజాన్ పైన ఆధునిక AI సామర్థ్యాలను ఉపయోగించవచ్చు. రూఫస్ AI, అమేజాన్ వారి AI-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్‌తో, కస్టమర్లు ఉత్పత్తులను కూడా పోల్చవచ్చు, వేగంగా జవాబులు , ధరల చరిత్ర, ఉత్పత్తి సంగ్రహం వీడియోలు, వ్యక్తిగత సిఫారసులు, ఇంకా ఎన్నో వాటిని పొందవచ్చు. కొత్త లెన్స్ AIతో, కస్టమర్లు స్నేహితుల దుస్తులు, సోషల్ మీడియాలో చూసినవి, లేదా స్థానిక స్టోర్ లోని ఉత్పత్తి ఫోటో తీసుకోవచ్చు మరియు అమేజాన్ వాటిని అమెజాన్ పైన తక్షణమే కనుగొనడంలో సహాయపడుతుంది. AI సమీక్షా ప్రధానాంశాలు వేలాది సమీక్షల నుండి కేవలం కొన్ని సెకండ్లలోనే కీలకమైన అంశాలను గ్రహించడంలో సహాయపడతాయి. క్విక్ లెర్న్, బైయ్యింగ్ గైడ్స్‌తో, ల్యాప్‌టాప్స్, ఉపకరణాలు, లేదా స్మార్ట్ ఫోన్స్ వంటి సంక్లిష్టమైన వివరణలు సరళం చేయబడ్డాయి, షాపింగ్ నిర్ణయాలను సులభంగా, ఒత్తిడిరహితంగా చేసాయి.