Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2024 కోసం భారత్- మలేసియా మధ్య 1.5 మిలియన్ ఫ్లైట్ సీట్లను సిద్ధం చేసిన ఎయిర్ ఏషియా

Air Asia
, శుక్రవారం, 1 డిశెంబరు 2023 (22:29 IST)
ఎయిర్ లైన్స్ రంగంలో ఎయిర్ ఆసియాది ఒకే ప్రత్యేక స్థానం. ఎంతోమంది ప్రయాణికుల్ని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చింది. ఇప్పుడు కూడా అదే అంకితభావంతో, అదే లక్ష్యంతో పనిచేస్తుంది. తాజాగా ఎయిర్ ఆసియా... మలేషియా మరియు భారతదేశం మధ్య ప్రయాణాల్లో గణనీమైన పెరుగుదలను తాము గుర్తించినట్లు ప్రకటించింది. అంతేకాకుండా రాబోయే 2024 మొదటి 3 నెల్లలో ప్రారంభమయ్యే మొత్తం 69 వారపు విమానాల ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.
 
డిసెంబర్ 1, 2023 నుంచి భారతదేశం నుంచి మలేషియాలోకి వచ్చే ప్రయాణికులకు 30 రోజుల వీసా-రహిత ప్రవేశాన్ని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. దీనిద్వారా ప్రయాణ డిమాండ్‌లో ఊహించిన పెరుగుదలకు ప్రతిస్పందనగా సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల వచ్చింది. ఈ ప్రకటన ద్వారా భారతదేశం నుండి థాయ్ లాండ్ మరియు వియత్నాం దేశాలకు వచ్చే సందర్శకులకు వీసా-రహిత ప్రవేశం గురించి చేసిన ప్రకటనతో సమానంగా ఉంటాయి. ఇది కౌలాలంపూర్‌ నుంచి ఒక-స్టాప్‌తో ఎయిర్ ఆసియా యొక్క ఫ్లై-త్రూ సేవ ద్వారా ఇతర ఆసియాన్ దేశాలకు వెళ్లేందుకు భారతీయ ప్రయాణికులను అనుమతిస్తుంది. అంటే బ్యాంకాక్, ఫుకెట్, హనోయి, హో చి మిన్, సిడ్నీ, మెల్‌బోర్న్, పెర్త్ లాంటి నగరాలకు సజావుగా కనెక్ట్ అవుతుంది.
 
ఈ సందర్భంగా క్యాపిటల్ ఏ సీఈఓ శ్రీ టోనీ ఫెర్నాండెజ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “ఇది ఎయిర్ ఆసియా  మాత్రమే కాకుండా మన దేశానికి కూడా చాలా ముఖ్యమైన మరియు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న వార్. ముందుచూపుతో కూడిన ఈ అద్భుతమైన నిర్ణయానికి మలేషియా ప్రభుత్వానికి, ప్రత్యేకించి ప్రధాన మంత్రి Dato’Seri అన్వర్ ఇబ్రహీమ్‌కి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారతదేశం నుండి మలేషియా పర్యటనను సులభతరం చేయడానికి ఎయిర్ ఆసియా ముందంజలో ఉంది. భారతీయ పౌరులకు 30-రోజుల వీసా-రహిత ప్రవేశం ఈ గొప్ప దేశాల మధ్య ఆర్థిక బంధాలను పెంపొందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే పీక్ ట్రావెల్ సీజన్‌కు ముందు మలేషియా పర్యాటకం మరియు దాని ఆర్థిక వ్యవస్థకు స్వాగతించే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. విమానయాన రంగంలో కీలకమైన భాగస్వామిగ, ఈ ప్రాంతంలో సరసమైన మరియు అందుబాటులో ఉండే విమాన ప్రయాణం కోసం డిమాండ్‌కు మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని జోడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అన్నారు ఆయన.
 
ఈ సందర్భంగా ఎయిర్ ఆసియా రీజినల్ కమర్షియల్ (ఇండియా) హెడ్ శ్రీ మనోజ్ ధర్మాని మాట్లాడారు. ఆయన. మాట్లాడుతూ... “ఈ రెండు అతిపెద్ద మార్కెట్‌ల మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించడమే కాకుండా గణనీయమైన ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేయడానికి మేము దీనిని ఒక అవకాశంగా భావిస్తున్నాము. వచ్చే ఏడాది మొదటి 3 నెలల్లో, ఎయిర్ ఆసియా నుంచి బెంగళూరు, కోల్‌కతా, కొచ్చి, హైదరాబాద్, చెన్నై, తిరుచిరాపల్లి, న్యూఢిల్లీ, అమృత్‌సర్ మరియు త్రివేండ్రం లాంటి భారతదేశంలోని తొమ్మిది గమ్యస్థానాల నుండి కౌలాలంపూర్‌కు వారానికి మొత్తం 69 విమానాలను నడుపుతుంది. ఇది ఫిబ్రవరి 2024 నుండి కొత్త గమ్యస్థానంగా మారబోతుంది అని అన్నారు ఆయన.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎగ్జిట్ పోల్ అంచనాలు.. కాంగ్రెస్ అలెర్ట్.. బెంగళూరుకు ఎమ్మెల్యేలు