Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరువనంతపురం నుంచి కౌలాలంపూర్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసుని మొదలుపెట్టిన ఎయిర్ ఆసియా

Advertiesment
image
, మంగళవారం, 21 నవంబరు 2023 (17:45 IST)
భారతదేశంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీగా పేరు తెచ్చుకున్న ఎయిర్ ఆసియా తన కొత్త సర్వీసుని ఇవాళ మొదలుపెట్టింది. కేరళ రాజధాని తిరువనంతపురం లేదా త్రివేండ్రం నుంచి కౌలాలంపూర్, మలేషియాకు కొత్త సర్వీసుని ప్రకటించింది. దీంతో ఇది కేరళ రాష్ట్రం నుంచి రెండో అంతర్జాతీయ విమాన సర్వీసు. గతంలో 'గాడ్స్ ఓన్ కంట్రీ' అయినటువంటి కేరళ కొచ్చి నుండి కౌలాలంపూర్‌కు వారానికోసారి విమాన సర్వీసు ఉండేది. ఈ కొత్త సర్వీసు 21 ఫిబ్రవరి 2024న వారానికి నాలుగు సార్లు ఫ్రీక్వెన్సీతో బయలుదేరుతుంది. తద్వారా మలేషియా రాజధాని నగరం అయినటువంటి కౌలాలంపూర్‌‌కు ప్రయాణించాలని చూస్తున్న అన్ని వర్గాల ప్రయాణికుల నుండి విశేషమైన ప్రతిస్పందనను అందుకోవచ్చని భావిస్తున్నారు. కౌలాలంపూర్ అనేక నిర్మాణ అద్భుతాలకు నిలయం, నోరూరించే స్థానిక వంటకాలు, ఆకట్టుకునే మార్కెట్లు లాంటి ఎన్నో అద్భుతాలు ఈ దేశంలో ఉన్నాయ.
 
2008లో ఎయిర్ ఆసియా తిరుచిరాపల్లి-కౌలాలంపూర్ రూట్‌లో మొదటి సర్వీసుగా విమానాలను ప్రారంభించినప్పటి నుండి భారతదేశం నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణీకులను చాలా కాలంగా కనెక్ట్ చేసింది. ఈ కొత్త కనెక్టివిటీ ప్రారంభంతో భారతదేశం నుండి మలేషియాకు ఎయిర్‌లైన్ యొక్క 9వ మార్గాన్ని అందిస్తుంది. ప్రస్తుతం మలేషియా(AK)కు ఎయిర్ ఆసియా దక్షిణ భారత నగరాలైనటువంటి చెన్నై, తిరుచిరాపల్లి, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు, కోల్‌కతా మీదుగా 6 ప్రత్యక్ష మార్గాలను అలాగే ఉత్తర భారతదేశం నుండి 2 ప్రత్యక్ష మార్గాలను నడుపుతోంది. ఇంకా ఉత్తర భారతదేశం నగరాలైన అమృత్‌సర్, న్యూఢిల్లీకి మలేషియాకు AirAsia X (D7) సర్వీసులు ఉన్నాయి.  
 
ఈ సందర్భంగా ఎయిర్ ఆసియా మలేషియా సీఈఓ శ్రీ రియాద్ అస్మత్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. “చారిత్రాత్మక నగరమైన తిరువనంతపురానికి ఈ కొత్త రూట్‌తో భారతదేశంలో మా ఉనికి బలోపేతం అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. మహమ్మారి తర్వాత భారతదేశంలోని మా ముఖ్య గమ్యస్థానాలను క్రమంగా తిరిగి ప్రారంభించడంతో గతేడాది మాకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. ఈ కొత్త రూట్‌ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించడంతో, మేము త్వరలో ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశం అంతటా మొత్తం 9 అద్భుతమైన గమ్యస్థానాల నుండి వారానికి 71 విమానాలతో నేరుగా మలేషియాకు అందించగలుగుతున్నాము. ఇదే కోవలో రాబోయే రోజుల్లో మరిన్ని రాబోతున్నాయి
 
“నిస్సందేహంగా, మలేషియా ప్రయాణికులకు ఎయిర్ ఆసియా అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో భారతదేశం ఒకటి. రెండు దేశాల మధ్య అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీలో మాకు 47% మార్కెట్ వాటా ఉంది. గత దశాబ్దంన్నర కాలంగా, మేము భారతదేశంలో ప్రయాణ స్థితిగతులను సమూలంగా మార్చాము. అనేక మిలియన్ల మంది ప్రయాణికులను మలేషియాకు, అంతకు మించిన ఖర్చుతో కనెక్ట్ చేసాము. పర్యాటక పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి, తిరువనంతపురం మరియు భారతదేశంలోని ఇతర నగరాలకు విమాన ప్రయాణాన్ని మరింత ఉత్తేజపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాము అని అన్నారు.
 
ఈ సందర్భంగా ఎయిర్ ఆసియా రీజినల్ కమర్షియల్ (ఇండియా) హెడ్ శ్రీ మనోజ్ ధర్మాని మాట్లాడారు. “ఈ కొత్త మార్గం భారతదేశంలో ఎయిర్ ఆసియా అనేక మైలురాళ్లలో ఒకటిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేము అందమైన దక్షిణ నగరం నుండి కౌలాలంపూర్‌కు ప్రయాణికులను కలపబోతున్నాము. ఈ విస్తరణ సరసమైన, అందుబాటులో ఉన్న ప్రయాణాన్ని అందించడంలో ఎయిర్ ఆసియా యొక్క తిరుగులేని నిబద్ధతను బలోపేతం చేయడమే కాకుండా మలేషియా, భారతదేశం మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందిస్తుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఈ కొత్త మార్గం మా అతిథులను తీసుకువచ్చే అవకాశాల ప్రపంచాన్ని అన్వేషించడానికి మేము ఎదురుచూస్తున్నాము, వారికి శక్తివంతమైన సంస్కృతులు, విభిన్న ప్రకృతి దృశ్యాలు, అసమానమైన అనుభవాలను అందజేస్తుంది అని అన్నారు.
 
ఎయిర్ ఆసియా 2001 నుండి 800 మిలియన్ల మంది అతిథులకు ప్రయాణ సౌకర్యాలను అందించింది. ఎయిర్ ఆసియా ఈ కొత్త ప్రయోగం ఒక ఉత్తేజకరమైన సమయంలో అందించబడింది. ఎయిర్ ఆసియా ఇవాళ్టి నుండి 26 అక్టోబర్ 2024 నుండి రూ.4,999లకే అందిస్తోంది. 21 ఫిబ్రవరి 2024 నుండి 19 మార్చి 2025 మధ్య ప్రయాణం కోసం తిరువనంతపురం నుండి కౌలాలంపూర్ వరకు రూ.999 ఆల్-ఇన్* వన్-వే- ఉచిత 20 కిలోల చెక్-ఇన్ బ్యాగేజీతో సహా లాంటి అద్బుతమైన ఫీచర్స్‌ని అందిస్తుంది. బుకింగ్ కోసం ఎయిర్‌ ఆసియా సూపర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని 'ఫ్లైట్స్' చిహ్నంపై క్లిక్ చేయండి.
 
తిరువనంతపురం (TRV) నుండి కౌలాలంపూర్ (KUL)కి విమాన షెడ్యూల్:
 
Route- తిరువనంతపురం టు కౌలాలంపూర్,
Flight No- AK8,
Departure- 00:25,
Arrival- 07:05,
Frequency- మంగళ, గురు, శని, ఆది
 
Route- కౌలాలంపూర్ టు తిరువనంతపురం
Flight No- AK9
Departure- 22:30
Arrival- 23:50
Frequency- సోమ, బుధ, శుక్ర, శని
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ రహదారుల్లో పాదచారులు నడవరాదు.. సుప్రీంకోర్టు