Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్యం, జీవక్రియ పరిశోధనలో ఎజిలెంట్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ భాగస్వామ్యం

Advertiesment
image

ఐవీఆర్

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (19:16 IST)
హైదరాబాద్: పోషకాహారం, జీవక్రియ పరిశోధనలో భారతదేశపు ప్రయత్నాలను మరింత శక్తివంతం చేసే దిశగా, అరుంద (అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ యూనిట్ ఆన్ మెటబాలిజం, డెవలప్‌మెంట్, అండ్ ఏజింగ్)కు మద్దతు ఇవ్వడానికి ఎజిలెంట్ టెక్నాలజీస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ఆర్), హైదరాబాద్ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించాయి. దేశంలో పెరుగుతున్న సంక్రమణేతర వ్యాధులు(ఎన్సిడిలు), పోషకాహార లోప సమస్యను పరిష్కరించడానికి టిఐఎఫ్ఆర్ యొక్క పరిశోధన ప్రయత్నాలను విశ్లేషణాత్మక శాస్త్రంలో ఎజిలెంట్ యొక్క ప్రపంచ నైపుణ్యాన్ని ఈ భాగస్వామ్యం తీసుకువస్తుంది.
 
హైదరాబాద్‌లో ఎజిలెంట్-టిఐఎఫ్ఆర్ సెంటర్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ రీసెర్చ్‌ను ప్రారంభించడం ద్వారా ఈ భాగస్వామ్యం యొక్క కీలక ఫలితం వచ్చింది.  మానవ ఆరోగ్య పరంగా భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రభుత్వ-మద్దతు గల కార్యక్రమాలలో ఒకటైన అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ యూనిట్ ఆన్ మెటబాలిజం, డెవలప్‌మెంట్ & ఏజింగ్ కు మద్దతు ఇవ్వడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. డేటా ఆధారిత ఆవిష్కరణను నడిపించడానికి, ప్రజారోగ్య వ్యూహాలను తెలియజేయడానికి ప్రాథమిక జీవశాస్త్రాన్ని క్లినికల్ పరిజ్ఞానంతో అనుసంధానించడంపై ‘అరుంద’ దృష్టి సారించింది. ప్రభావవంతమైన అనువాద పరిశోధనకు మద్దతు ఇచ్చే అధిక-పనితీరు కలిగిన విశ్లేషణాత్మక పరిష్కారాల ద్వారా ఈ లక్ష్యం ముందుకు తీసుకువెళ్లడంలో ఎజిలెంట్ యొక్క పాత్ర కేంద్రీకృతమై ఉంది. 
 
మాలిక్యులర్ ప్రొఫైలింగ్, మెటబోలోమిక్స్, ట్రేస్ ఎలిమెంట్ విశ్లేషణ, సెల్యులార్ బయోఎనర్జెటిక్స్ వంటి కీలక రంగాలకు మద్దతు ఇచ్చే అధునాతన విశ్లేషణాత్మక సామర్థ్యాలకు ఎజిలెంట్ తోడ్పడుతుంది. మానవ జీవశాస్త్రం యొక్క సంక్లిష్టతలను అన్వేషించటానికి, భవిష్యత్ జోక్యాలకు మార్గనిర్దేశం చేసే పరిజ్ఞానం కనుగొనడంలో ఈ సమగ్రమైన పరిష్కారాలు పరిశోధకులకు సహాయపడతాయి. ముఖ్యంగా భారీ -స్థాయి, జనాభా-ఆధారిత అధ్యయనాల సందర్భంలో ఇది తోడ్పడుతుంది. ఈ విధానం డేటా ఆధారిత, ప్రభావవంతమైన విజ్ఞాన శాస్త్రాన్ని సాధ్యం చేయటంపై భాగస్వామ్యం యొక్క లక్ష్యంను పునరుద్ఘాటిస్తుంది. 
 
"టిఐఎఫ్ఆర్‌తో మా భాగస్వామ్యం సాంకేతికత, సహకారం, ఉమ్మడి ప్రయోజనం ద్వారా పరివర్తన శాస్త్రాన్ని సాధ్యంచేయటానికి ఎజిలెంట్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని ఎజిలెంట్ టెక్నాలజీస్ ఇండియా కంట్రీ జనరల్ మేనేజర్ నందకుమార్ కలథిల్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ "జాతీయ ప్రాధాన్యతలతో సమలేఖనం చేయబడిన, వాస్తవ-ప్రపంచ ఆరోగ్య ప్రభావాన్ని చూపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఈ స్థాయి మరియు ఆశయం కలిగిన ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది " అని అన్నారు. 
 
టిఐఎఫ్ఆర్ హైదరాబాద్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణమూర్తి మాట్లాడుతూ, "ప్రాథమిక పరిశోధనలను వాస్తవ-ప్రపంచ పరిష్కారాలలోకి తీసుకురావటానికి చేస్తోన్న మా ప్రయత్నాలలో ఈ భాగస్వామ్యం ఒక అర్ధవంతమైన ముందడుగును సూచిస్తుంది. ఎజిలెంట్-టిఐఎఫ్ఆర్ సెంటర్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ మా శాస్త్రీయ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. జీవనశైలి సంబంధిత వ్యాధులకు సంబంధించి పెరుగుతున్న భారాన్ని తగ్గించటంలో చేస్తోన్న జాతీయ ప్రయత్నాలకు మద్దతునందిస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ మార్కెట్లలో సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 స్టాక్ అయిపోయింది