Publish Date: Mon, 27 Apr 2020 (22:58 IST)
Updated Date: Mon, 27 Apr 2020 (23:00 IST)
చాలామందిని బాగా ఇబ్బందిపెట్టే సమస్య చుండ్రు. ఈ చుండ్రుని పోగొట్టుకోవడం కోసం చాలామంది రసాయనాలున్న షాంపూల్ని వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే దీన్ని పోగొట్టుకోవచ్చు. జుట్టుని ఓసారి తడిపాక, అరచేతిలో బేకింగ్ సోడా తీసుకుని మాడుకి మర్దన అయ్యేట్లు బాగా రుద్దాలి. ఇది మాడుపై ఉన్న ఫంగస్‌ను తొలగిస్తుంది. అయితే బేకింగ్ సోడాతో రుద్దిన తరువాత షాంపూ వాడకూడదు.
మూడు నుంచి అయిదు చెంచాల కొబ్బరి నూనెని రాత్రి పడుకునే ముందు మాడుకి బాగా పట్టించాలి. ఉదయం తక్కువ గాఢత కలిగిన షాంపూతో స్నానం చేయాలి. ఇలా ప్రతి మూడు రోజులకోసారి చేస్తే ఫలితం ఉంటుంది.
రెండు చెంచాల నిమ్మరసాన్ని మాడుకి తగిలేలా రాసుకుని ఐదు నిమిషాలయ్యాక షాంపూతో కడిగేసుకోవాలి. తరువాత కప్పు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం వేసి జుట్టకి పట్టించి వదిలేయాలి. నిమ్మలోని ఆమ్లతత్వం చుండ్రు పట్టకుండా చూస్తుంది.
సిహెచ్
Publish Date: Mon, 27 Apr 2020 (22:58 IST)
Updated Date: Mon, 27 Apr 2020 (23:00 IST)