Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాఫీ పొడిని జుట్టుకు రాసుకుంటే? ఏమవుతుందో తెలుసా?

హెయిర్‌ డై వేసుకున్నప్పుడు అవి జుట్టుకు సరిపడకపోవడం, కేశాల సహజమైన కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటికి విరుగుడుగా శిరోజాలకు ఆరోగ్యాన్ని సహజమైన రంగును ఇచ్చేవి ఉన్నాయి. మరి అవేంటో చూద్

కాఫీ పొడిని జుట్టుకు రాసుకుంటే? ఏమవుతుందో తెలుసా?
, బుధవారం, 11 జులై 2018 (12:01 IST)
హెయిర్‌ డై వేసుకున్నప్పుడు అవి జుట్టుకు సరిపడకపోవడం, కేశాల సహజమైన కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటికి విరుగుడుగా శిరోజాలకు ఆరోగ్యాన్ని సహజమైన రంగును ఇచ్చేవి ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం.
 
స్పూన్ కాఫీ గింజలు లేదా పొడిని కప్పు నీటిలో వేసి బాగా మరిగించి 20 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. జుట్టు కాస్త నలుపు రంగు రావాలంటే కాఫీ డికాషన్‌లో పావు స్పూన్ లవంగాల పొడిని కలుపుకుని మరిగించాలి. ఈ డికాషన్‌ని కడగట్టుకోవాలి. ఇప్పుడు తలస్నానం చేసి ఆ కాఫీ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. 20 నిమిషాల తరువాత జుట్టును కడిగేసుకోవాలి.
 
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రంగు మెరుగుపడుతుంది. డై వాడకం వలన కేశాలకు కలిగే హాని కూడా తగ్గుతుంది. బీట్‌రూట్‌ను పేస్ట్ చేసి నీళ్లలో కలుపుకుని మరిగించాలి. చల్లారిన తరువాత వడకట్టిన నీటిని రాత్రి పడుకునేముందుగా మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటిరోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి.
 
వారానికి రెండు సార్లు ఇలా చేస్తుంటే కురులకు కొద్దిగా పర్పుల్ కలర్ వస్తుంది. హెయిర్ కలర్స్ కూడా వాడే యువతరపు జుట్టుకు ఇది చాలా ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది. ముదురు రంగు బంతిపూలను రెండు కప్పుల నీళ్లలో వేసుకుని బాగా మరిగించాలి. ఈ నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి.
 
గంట తరువాత తలస్నానం చేయాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా మారుతాయి. డై వాడేవారు జుట్టు పొడిబారి వెంట్రుకలు బిరుసు అవుతుంటాయి. నివారణకు స్పూన్ పెరుగులో పెసరపిండి కలిపి రోజంతా అలానే ఉంచాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని మాడుకు, శిరోజాలకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జామ ఆకులతో టీ త్రాగితే? శ్వాసకోశ సమస్యలు?