Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెన్నలో కొద్దిగా మీగడను కలిపి ముఖానికి రాసుకుంటే?

చర్మం పొడిగా మారితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. పొడి చర్మాన్ని మృదువుగా చేసేందుకు చాలామంది వివిధ రకాల క్రీములపై ఆధాపడుతుంటారు. కానీ అలాంటి కృత్రిమ పదార్థాల జోలికి వెళ్లకుండా ఇంట్లో సహజ సిద్ధంగా లభిం

Advertiesment
butter
, సోమవారం, 6 ఆగస్టు 2018 (15:39 IST)
చర్మం పొడిగా మారితే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. పొడి చర్మాన్ని మృదువుగా చేసేందుకు చాలామంది వివిధ రకాల క్రీములపై ఆధాపడుతుంటారు. కానీ అలాంటి కృత్రిమ పదార్థాల జోలికి వెళ్లకుండా ఇంట్లో సహజసిద్ధంగా లభించే వెన్నతోనే డ్రై స్కిన్ సమస్యల నుంటి విముక్తి చెందవచ్చును.
 
స్పూన్ వెన్నలో స్పూన్ మీగడను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. ముఖం కాంతివంతమవుతుంది. అరటి పండు గుజ్జులో కొద్దిగా వెన్నను కలుపుకుని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల ముడతలు తొలగిపోతాయి. 
 
వెన్నలో చిటికెడు పసుపును కలుపుకుని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. వెన్నలో ఉడికించిన క్యారెట్ గుజ్జును కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా వెన్నను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గర్భిణీ మహిళలు చేపలు తినకుంటే.. శిశువుకు హాని తప్పదట..?