మనకు సహజసిద్దంగా లభించే నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే విషయం మనందరికి తెలిసిందే. కానీ నిమ్మరసం చర్మ సౌందర్యానికి మృత కణాలను తొలగించడానికి, బ్లాక్‌హెడ్స్‌ను పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో చర్మ ఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. దీనివలన ప్రయోజనాలేమిటో చూద్దాం.
1. పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది.
2. ముఖచర్మం మృదువుగా ఉండాలంటే పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండుసార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
3. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తెల్లగా అవ్వాలంటే పచ్చిపాలలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి. దీనివల్ల ముఖంపై పేరుకున్న మృతకణాలు తొలగి చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
4. అర చెక్క నిమ్మరసానికి కొద్దిగా నీళ్లు అర చెంచా తేనె కలిపి పేస్టులా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషముల తరువాత కడిగివేయాలి. ఇలా చేయడం వలన ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
5. రెండు చెంచా నిమ్మరసానికి చెంచా తేనె, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికి, మెడకి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. దీనివలన తేమతో పాటు ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.