మెంతి పొడి, నిమ్మరసంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?
జాజికాయ పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా, కాంతివంతంగా మా
జాజికాయ పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. తద్వారా మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
మెంతులను పొడిచేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, పసుపు, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన ముఖంపై మెుటిమలు తొలగిపోతాయి. ఓట్స్‌లో కొద్దిగా టమోటా రసం, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చామంతి పువ్వుల నూనెలో కొద్దిగా ఓట్స్ పొడి, తేనె, కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంపై గల మెుటిమలు, కంటి కిందటి గల నల్లటి వలయాలు తొలగిపోతాయి. తద్వారా ముఖం అందంగా, మృదువుగా మారుతుంది.