నిద్రలేమితో బాధపడుతున్నారా... జాజికాయ పొడిని తీసుకుంటే?
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను నేతిలో వేయించి పొడిచేసి ఆవుపాలతో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే నరాల బలహీనతనకు మంచిగా ఉపయోగపడుతుంది. జాజికాయ పొడి
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను నేతిలో వేయించి పొడిచేసి ఆవుపాలతో కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే నరాల బలహీనతనకు మంచిగా ఉపయోగపడుతుంది. జాజికాయ పొడిని తరచుగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జాజికాయతో నోటి దుర్వాసనలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పంటిమీద నలుపు చారలను తొలగించుటకు జాజికాయ మంచిగా ఉపయోగపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు నుండి కాపాడుతుంది. చర్మం ముడతలు గల వారు ఈ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తీసుకోవడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.
శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించుటకు జాజికాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో రాళ్లను కరిగించుటకు మంచిగా దోహదపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు ఈ జాజికాయ పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని తీసుకుంటే చక్కని నిద్ర వస్తుంది. మలేరియా జ్వారానికి జాజికాయ చాలా మంచిది. దగ్గు, జలుబు, కఫాం వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది.