పండిన అరటిపండుతో బ్యూటీ చిట్కాలు....
పండిన అరటిపండుతో ఎన్నోలాభాలున్నాయి. అరటిపండును సౌందర్య సాధనంగా ఉపయోగించుకోవచ్చును. పండిన అరటి పండులో 3 చెంచాల నిమ్మరసం కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంలోని జిడ్డు తొలగిపోతుంది.

పండిన అరటిపండులో కాస్త తేనెను కలుపుకుని ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మసాజ్ చేసుకుంటే చర్మంపై ముడతలు తొలగిపోతాయి. సగం కప్పు పెరుగు, అవకాడో, పండిన అరటి పండును తీసుకుని పేస్ట్‌లా చేసుకుని జుట్టుకు రాసుకుంటే చిక్కులు పోయి మృదువుగా తయారవుతుంది. పండిన అరటిపండును నేరుగా శరీరానికి అప్లై చేసుకుంటే మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.