కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.....
నిమ్మకాయల్ని తడిబట్టలో పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే స
నిమ్మకాయల్ని తడిబట్టలో పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది. కాఫీ పొడిని ఫ్రిజ్‌లో పెడితే సువాసన పోదు గడ్డ కట్టకుండా తాజాగా ఉంటుంది. కిచెన్‌లో ఉపయోగించే పాత నాప్కిన్‌ని వెనిగర్‌లో ముంచి ఫ్రిజ్‌ని శుభ్రం చేస్తే వాసనతో పాటు పురుగులు కూడా రావు.
గోరువెచ్చని నీటిలో కత్తిని ముంచితే డ్రైఫూట్స్‌ను తేలికగా కట్ చేయవచ్చును. కొబ్బరిచిప్ప నుండి కొబ్బరి త్వరగా ఊడి రావాలంటే కొబ్బరి చిప్పను ఫ్రిజ్‌లో ఉంచితే మంచిది. ఫ్రిజ్‌లో కూరగాయలు పెట్టుకునే షెల్ఫ్‌లో అడుగున పేపర్ వేసి ఉంచితే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వెన్న కాచేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.