వర్షాకాలంలో బత్తాయి రసాన్ని తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. బత్తాయి జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటంతో కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బత్తాయిలో విటమిన్ సీ, ఫాస్పరస్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
బత్తాయి జ్యూస్‌ని క్రమం తప్పకుండా తాగడం వల్ల అజీర్ణ సమస్యలు, ప్రేగు కదలికలు వంటి సమస్యలు తగ్గుతాయి. బత్తాయి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. రసంలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడం, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం, పర్యావరణ కారకాల వల్ల చర్మం దెబ్బతినకుండా నిరోధిస్తుంది.