పుల్లటి తేపులు వస్తున్నాయా? ఏలకులు తినండి..
ఆహారం తీసుకుంటే పుల్లటి తేపులు వస్తున్నాయా..? యాలకులు తినండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కడుపు ఉబ్బరం, కడుపులో మంట, ఆకలి లేకపోవడం వంటి రుగ్మతల నుంచి బయటపడాలంటే.. యాలకులు రెండేసి నమిలితే సరిపోతుంది.
ఆహారం తీసుకుంటే పుల్లటి తేపులు వస్తున్నాయా..? యాలకులు తినండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కడుపు ఉబ్బరం, కడుపులో మంట, ఆకలి లేకపోవడం వంటి రుగ్మతల నుంచి బయటపడాలంటే.. యాలకులు రెండేసి నమిలితే సరిపోతుంది. ఇంకా శొంఠి, మిరియాలు, ఏలకులు, జీలకర్ర వంటివి పుల్లటి తేపులను దూరం చేస్తాయి. అకాల భోజనం, నూనె పదార్థాలు, ఫలహారాలు, మసాలా పదార్థాలను తీసుకుంటే కొందరిలో పుల్లటి తేపుల సమస్య ఏర్పడుతుంది.
అలాంటప్పుడు శొంఠి, మిరియాలు, ఏలకులు, జీలకర్ర పొడులను అరస్పూన్ మేర తీసుకుని.. దీనితో పాటు అర స్పూన్ బెల్లాన్ని చేర్చి ఒక గ్లాసుడు నీటిలో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ఆహారం తీసుకున్న అరగంట తర్వాత తీసుకుంటే పుల్లటి తేపులు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం తొలగిపోతుంది.
అలాగే ఉసిరికాయ, అల్లం కూడా పుల్లటి తేపులను నయం చేస్తాయి. ఉసిరికాయ రసాన్ని, అల్లం రసాన్ని సమపాళ్లలో తీసుకునే తగినంత బెల్లం చేర్చి ఒక గ్లాసుడు నీటిలో మరిగించాలి. ఆరిన తర్వాత తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.