అందానికి గోధుమ పూత...
గోధుమలు ఆరోగ్యానికే కాదు... అందానికి మేలు చేస్తాయి. ముఖంలో జిడ్డు తొలగిపోవడానికి, నల్లమచ్చలు, నలుపు పోవడానికి గోధుమ పిండితో వేసేపూత చక్కని ఫలితాలనిస్తుంది. 1. మూడు చెంచాల గోరువెచ్చని పాలల్లో చెంచా గూలాబీ నీరు, కొద్దిగా తేనె, రెండు చెంచాల గోధుమపిండిన
గోధుమలు ఆరోగ్యానికే కాదు... అందానికి మేలు చేస్తాయి. ముఖంలో జిడ్డు తొలగిపోవడానికి, నల్లమచ్చలు, నలుపు పోవడానికి గోధుమ పిండితో వేసేపూత చక్కని ఫలితాలనిస్తుంది.
1. మూడు చెంచాల గోరువెచ్చని పాలల్లో చెంచా గూలాబీ నీరు, కొద్దిగా తేనె, రెండు చెంచాల గోధుమపిండిని వేసి ఉండకట్టకుండా కలపాలి. దీనిని ముఖానికి వేసుకుని ఆరిన తర్వాత కడిగివేసి మాయిశ్చరైజర్ రాయాలి. తేమతో చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.
2. రెండు చెంచాల పాలమీగడకు గోధుమపిండి కలిపి చక్కని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ పూతకు చర్మంలోని మెలనిన్‌ని నియంత్రించి నల్లమచ్చలు రాకుండా చేసే శక్తి ఉంది.
3. నాలుగు చెంచాల గోధుమపిండికి తగినన్ని నీళ్ళు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి దట్టంగా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగివేస్తే చాలు. జిడ్డు పోయి ముఖం కాంతితో నిగారిస్తుంది. ఛాయ పెరుగుతుంది.
4. ఒక కప్పు వేడి నీటిలో గుప్పెడు గులాబీ రేకులు కొద్దిగా తేనె చెంచా నిమ్మతొక్కల పొడి వేసుకోవాలి. ఇందులో గోధుమపిండి కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేయాలి.