తులసి ఆకుల 'టీ' త్రాగితే... మధుమేహ వ్యాధికి...
తులసి ఆకులలో గల ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇలా ఉపయోగపడే ఈ తులసి ఆకులతో టీ తయారుచేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలనున్నాయి. మరి ఆ ప్ర
తులసి ఆకులలో గల ఔషధ గుణాలు పలు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తాయి. ఇలా ఉపయోగపడే ఈ తులసి ఆకులతో టీ తయారుచేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలనున్నాయి. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.
ఒక గిన్నెలో తులసి ఆకులు వేసుకుని అందులో కొద్దిగా అల్లం, 1/2 వాము, స్పూన్ జీలకర్ర, 1/2 మిరియాలు, కాస్త బెల్లం వేసుకుని బాగా టీలా మరిగించుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తరువాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గించుటకు ఈ తులసి చాలా సహాయపడుతుంది.
మధుమేహం వ్యాధితో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ తులసి ఆకుల టీలో ఉండే పొటాషియం మెదడులో సెరోటినిన్ లెవల్స్‌ను పెంచుటలో చాలా దోహదపడుతుంది. దీంతో డిప్రెషన్ నుండి విముక్తి చెందవచ్చును.
కిడ్నీలో గల రాళ్లను కరిగించుటకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు దరిచేరవు. బీపీ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చేందుకు సహాయపడుతాయి. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.