Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి.. ఇలా చేస్తే..?

బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి.. ఇలా చేస్తే..?
, శనివారం, 16 మార్చి 2019 (11:55 IST)
ఆయుర్వేద రీత్యా వాతదోషం ప్రకోపించడం వలన కంటిపొరలు ఏర్పడుతుంటాయి. ఈ వాత దోషం కంటిని పొడిబారినట్టు చేసి పారదర్శకత లోపించేట్టు చేయడం వలన కంట్లో పొరలు ఏర్పడి దృష్టిలోపం కలుగుతుంది. ఈ లోపం సరిచేయడానికి వాత దోష ప్రకోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు. ఈ కంటి పొరలను ప్రత్యేకించి కొన్ని మూలికలతో కలిపి పిండి తయారుచేసిన ఆవు నెయ్యిని వాడడమే మంచిది. 
 
2 స్పూన్ల నెయ్యికి కొద్దిగా త్రిఫలచూర్ణం కలిపి రాత్రి నానబెట్టి ఉదయాన్నే వడబోసి సగం తాగి మిగిలిన నీటితో కళ్లను కడుక్కోవాలి. ఇలా చేయడం వలన రోగికి కంటి చూపు మెరుగవుతుంది. అలానే ఆవు పాలతో కొద్దిగా తెల్ల గలిజేరు వేరును ఆవునేతిలో మెత్తగా నూరి కంటికి పెడితే పొరలు కరుగుతాయి. ఇంకా చెప్పాలంటే.. బియ్యాన్ని నీటిలో మెత్తగా నూరి పెడితే కూడా అతిగా వ్యాపించే కంటి శుక్లాలు త్వరగా తగ్గిపోతాయి. 
 
పొద్దు తిరుగుడు చెట్టు గింజల చూర్ణాన్ని రోజుకు మూడు వేళ్లకు పట్టించి 21 రోజుల పాటు నీటితో వాడితే కంటి పొరలు తగ్గుముఖం పడుతాయి. కంటి సమస్య ఉన్నప్పుడు ముందుగా ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించాకే.. వారి సలహా మేరకు అనుసరించడం మంచిది. 
 
తానికాయలోని గింజలను పాలలో అరగదీసి కంటికి పెడుతుంటే కంటి పొరలు తగ్గి దృష్టి మెరుగుపడుతుంది. ఆముదం గింజలోని రసాన్ని గుడ్డలో వడగట్టి 2 చుక్కల చొప్పున రెండు కళ్లల్లో ఉదయాన్నే వేస్తుంటే కంటి సమస్యలు తొలగిపోతాయి. పొడపత్రి గింజలను కలబంద గుజ్జులో 10 రోజులు నానబెట్టి నీడన ఎండించి ఒక గింజను నీళ్లతో అరగదీసి కంటికి కందిగింజంత పెడుతుంటే అవి కంటిపొరలను కోసి మంచి దృష్టినిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెను నీటిలో కలిపి తాగితే.. ఏమవుతుంది..?