Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-10-2023 నుంచి 28-10-2023 వరకు మీ వార ఫలితాలు

Advertiesment
horoscope
, శనివారం, 21 అక్టోబరు 2023 (20:06 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఈ వారం అనుకూలదాయకం. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులను చేజిక్కించుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్ సేల్ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. విదేశీయానానికి సన్నాహాలు సాగిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అందుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలు కలిసివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామికంగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. సోదరీ సోదరుల వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. బుధవారం నాడు పనులు సాగవు. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. గృహ వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ధనలాభం ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. గురువారం నాడు దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంస్థల స్థాపనలకు తగిన సమయం. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆశాజనకం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. అయిన వారితో విభేదాలు తలెత్తుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య ఆకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. మాటతీరుతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. దైవదర్శనాలు మనశ్శాంతినిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. శనివారం నాడు ఒక సంఘటన ఆందోళన కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. గృహంలో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. చేతివృతులు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. వైద్య, న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు అభ్యంతరాలెదురవుతాయి. రాజీమార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
సంకల్పసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. ఆత్మవిశ్వాసంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. మీ కృషి ఫలించే శుభసమయం ఆసన్నమవుతోంది. బుధ, గురువారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. గృహమార్పు అనివార్యం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. పాతపరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగాలి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-10-2023 శనివారం రాశిఫలాలు - అమ్మవారిని ఆరాధించి ఆవుపాలను తీర్థంగా...