Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

23-07-2023 నుంచి 29-07-2023 వరకు మీ వార రాశిఫలాలు (video)

Advertiesment
Weekly astrology
, శనివారం, 22 జులై 2023 (21:04 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
బుద్ధిబలంతో కార్యం సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. మీ శ్రీమతితో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. మార్కెటింగ్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రయాణం తలపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. అవకాశాలను వదులుకోవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. గురు, శుక్రవారాల్లో పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆహ్వానం అందుకుంటారు. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నిరుద్యోగులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. షాపు పనివారలతో సమస్యలు ఎదురవుతాయి. వేడుకకు హాజరవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ కించపరచవద్దు. మీ తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు ప్రయోజనకరం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం పై చదువులపై దృష్టి సారిస్తారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. ఎరువులు, విత్తన వ్యాపారులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మికతపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం. మీ మాటతీరు మార్చుకోవటం శ్రేయస్కరం. మీ వ్యాఖ్యలు కొంతమందికి మనస్థాపం కలిగిస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తగిన సమయం. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. సోమ, మంగళవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒక నష్టాన్ని మరో విధంగా భర్తీ చేసుకుంటారు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
సింహం మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
అన్ని రంగాల వారికి యోగదాయకమే. రావలసిన ధనం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఖర్చులు సామాన్యయం. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. బుధవారం నాడు పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. నూతన వ్యాపారాలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యవసాయ, తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గురు, శుక్రవారాల్లో అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
ఈ వారం ఆశాజనకం. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. విజ్ఞతను చాటుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు భారమనిపించవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. సంతానం కదలికలపై దృష్టి సారించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ జోక్యంతోఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఎరువుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ కూలీలకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు నూతన బాధ్యతలు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
కార్యసాధనకు మరింత శ్రమించాలి. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. బంధువులతో స్పర్ధలు తలెత్తుతాయి. కలిసివచ్చిన అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది, శనివారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పెట్టుబడులకు తరుణం కాదు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో ఉండవు. ధన సమస్యలెదురవుతాయి. ఆప్తుల సాయంతో ఒక అవసరం నెరవేరుతుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానానికి శుభయోగం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. కొంతమందితో స్పర్ధలెదురవుతాయి. మీ మాటతీరు మార్చుకోవటం శ్రేయస్కరం. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. బుధ, గురువారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. కార్మికులు, కూలీలకు పనులు లభిస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదివారం నాడు నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతులు మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడకకు హాజరవుతారు. బంధువులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుల బాధలను తీర్చే పిండి దీపం.. శ్రావణ శుక్ర, శనివారాల్లో వెలిగిస్తే?