Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-07-2023 నుంచి 08-07-2023 వరకు మీ వార రాశిఫలాలు

Advertiesment
Weekly astrology
, శనివారం, 1 జులై 2023 (16:41 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. దైవకార్యానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
మీ కృషి ఫలిస్తుంది. విమర్శించిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సోమ, మంగళవారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు చేపడతారు. వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఈ వారం అన్ని రంగాల వారికీ ఆశాజనకమే. వివాహయత్నం ఫలిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. పెట్టుబడులకు అనుకూలం. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆడంబరాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త.
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. బుధవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. బాధ్యతగా మెలగండి. గృహమార్పు మంచి ఫలితమిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్సేల్ స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1,2 పాదములు 
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా మెలగాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురు, శుక్రవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతుల మధ్య అకారణ కలహం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. అవసరాలకు ధనం అందుతుంది. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెళకువ వహించండి. ప్రైవేట్ పాఠశాలలకు ఊహించని ఇబ్బందులెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆప్తులకు ముఖ్య సమాచారం అందస్తారు. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఆటుపోట్లను అధిగమిస్తారు. వ్యవసాయ కూలీలు, కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు బలపడతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. బుధ, గురువారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహనిర్మాణాలకు ప్లాన్ ఆమోదమవుతుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆది, సోమవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి. ఎవరినీ నిందించవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరుకు నిల్వలో జాగ్రత్త. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సంకల్పం సిద్ధిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయం సంతృప్తిరం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. మంగళ, బుధవారాల్లో చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. విందులు, వినోదాల్లో మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శని ప్రదోషం.. అభిషేక పదార్థాలు... ఫలితాలు