Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

09-07-2023 నుంచి 15-07-2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly astro
, ఆదివారం, 9 జులై 2023 (18:44 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
సంప్రదింపులు ఫలిస్తాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. అధికారులకు ధనప్రలోభం తగదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సహాయం తగదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శుక్ర, శనివారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వ్యవసాయ కూలీలకు పనులు లభిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ వారం కలిసివచ్చే సమయం. మీ తప్పిదాలు సరిదిద్దుకుంటారు. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవంల గడిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
సంకల్పం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. డబ్బుకు లోటుండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలుదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
అన్ని విధాల కలిసివచ్చే సమయం. చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. మంగళ, బుధవారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరచరాస్తులు కొనుగోళ్లపై దృష్టి పెడతారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి నిరాశాజనకం. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
గ్రహాలు సంచారం బాగుంది. అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఆర్థిక వివరాలు గోప్యంగా ఉంచండి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆది, సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణం కలిసివస్తుంది. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ప్రతికూలతలను అధిగమిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహార దక్షణతో రాణిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. మంగళవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. నిరుద్యోగులకు ఓర్పు, కృషి ప్రధానం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
శ్రమ అధికం, ఫలితం శూన్యం. ఆలోచనలతో సతమతమవుతారు. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బుధ, గురువారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఆశించినంత ఫలితమీయవు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
అనుకూలతలు నెలకొంటాయి. కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ శ్రీమతి అంతర్యం గ్రహించి మెలగండి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. శకునాలను పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కనిపించుకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలించదు. మీపై శకునాల ప్రభావం అధికం. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

09-07-2023 ఆదివారం రాశిఫలాలు - వాగ్దానాలు నిలుపుకోలేకపోతారు...